News January 30, 2025
శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు

శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు వచ్చింది. ఎయిర్పోర్టులో బాంబు పెట్టానంటూ ఓ ఆగంతకుడు అధికారులకు ఫోన్ చేశాడు. దీంతో పోలీసులు, డాగ్ స్క్వాడ్ సిబ్బంది ముమ్మరంగా తనిఖీలు చేశారు. చివరికి బాంబు లేదని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం కాల్ ఫేక్ అని పోలీసులు తేల్చారు. కామారెడ్డికి చెందిన మతిస్థిమితం లేని వ్యక్తి ఫోన్ చేసినట్లు గుర్తించారు.
Similar News
News November 25, 2025
సౌతాఫ్రికా డిక్లేర్.. భారత్ టార్గెట్ 549

టీమ్ ఇండియాతో రెండో టెస్టులో సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్సును డిక్లేర్ చేసింది. బవుమా సేన 5 వికెట్లు కోల్పోయి 260 రన్స్ చేసింది. స్టబ్స్ 94 పరుగులు చేసి ఔట్ అయ్యారు. సౌతాఫ్రికా భారత్ ముందు 549 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

భర్తపై గృహ హింస కేసు పెట్టిన నటి

బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ తన భర్త పీటర్ హాగ్పై గృహహింస కేసు పెట్టారు. ఆయన నుంచి రూ.50Cr నష్టపరిహారం ఇప్పించాలన్నారు. నెలకు తనకు రూ.10 లక్షలు మెయింటెనెన్స్ చెల్లించేలా ఆదేశించాలని ముంబై కోర్టును కోరారు. అంతేకాకుండా ముంబైలోని తన నివాసంలోకి హాగ్ను ప్రవేశించకుండా ముగ్గురు పిల్లలను తానే చూసుకునే అనుమతివ్వాలన్నారు. దీంతో కోర్టు హాగ్కు నోటీసులు జారీ చేసింది. జైట్లీ, హాగ్ 2011లో పెళ్లి చేసుకున్నారు.