News May 14, 2024

తిహార్ జైలుకు బాంబు బెదిరింపు

image

తిహార్ జైలుకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. జైలును పేల్చేస్తామంటూ ఆగంతకుడు ఫోన్ చేసిన బెదిరించాడు. దీంతో జైలు అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన BRS MLC కవిత ప్రస్తుతం ఈ జైలులోనే ఉన్నారు.

Similar News

News March 31, 2026

మలయాళ డైరెక్టర్‌తో ఐకాన్ స్టార్ 25వ చిత్రం?

image

అల్లు అర్జున్ వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ప్రస్తుతం అట్లీ డైరెక్షన్‌లో ‘AA22’ తెరకెక్కుతుండగా, ఆ తర్వాత లోకేశ్ కనగరాజ్, త్రివిక్రమ్ చిత్రాలు లైన్‌లో ఉన్నాయి. ప్రతిష్ఠాత్మక 25వ చిత్రానికి మలయాళ నటుడు బాసిల్ జోసెఫ్ డైరెక్షన్ చేయనున్నట్లు సమాచారం. దీన్ని ‘గీతా ఆర్ట్స్’ పాన్ ఇండియా స్థాయిలో నిర్మించనుందని తెలుస్తోంది. కేరళలో ఐకాన్ స్టార్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే.

News March 31, 2026

రేపటి నుంచి NTR వైద్యసేవలు బంద్!

image

AP: రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ(ఆరోగ్యశ్రీ)లను నిలిపివేయనున్నట్లు నెట్‌వర్క్ ఆస్పత్రులు ప్రకటించాయి. రూ.3వేల కోట్ల పెండింగ్ బకాయిలను చెల్లించాలని యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుతున్నాయి.

News March 31, 2026

నా భర్తతో స్వేచ్ఛగా విభేదిస్తా: JD వాన్స్ సతీమణి ఉష

image

అన్ని విషయాల్లో తాను తన భర్తతో ఏకీభవించనని అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్ సతీమణి ఉష తెలిపారు. ఆయన చుట్టూ ఎంత మంది అడ్వైజర్స్ ఉన్నా.. కొన్ని విషయాల్లో వాన్స్ తననే సంప్రదిస్తారని వెల్లడించారు. అలా అని ఆయన పనిలో మాత్రం తాను జోక్యం చేసుకోనని చెప్పారు. ఏదీ దాచుకోకుండా ఒకరి అభిప్రాయాలు ఒకరితో పంచుకుంటామని, స్వేచ్ఛగా విభేదించుకుంటామని తెలిపారు. ఇది ఇద్దరి ఎదుగుదలకు దోహదం చేస్తుందని పేర్కొన్నారు.