News October 19, 2024
విస్తారా విమానానికి బాంబు బెదిరింపు!

ఢిల్లీ నుంచి లండన్‌కు బయల్దేరిన విస్తారా విమానానికి సోషల్ మీడియాలో బాంబు బెదిరింపు వచ్చినట్లు జాతీయ మీడియా పేర్కొంది. దీంతో విమానాన్ని ఫ్రాంక్‌ఫర్ట్‌కు దారి మళ్లించినట్లు తెలిపింది. విమానం ఫ్రాంక్ఫర్ట్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయిందని, తనిఖీలు చేస్తున్నట్లు సంస్థ ప్రకటన చేసింది. భద్రతా ఏజెన్సీలు క్లియర్ చేసిన తర్వాతే లండన్‌కు బయల్దేరుతుందని తెలిపింది.
Similar News
News November 1, 2025
గుడ్‌న్యూస్.. త్వరలో ఆస్తులకు యాజమాన్య హక్కులు!

దేశవ్యాప్తంగా 3.46 లక్షల గ్రామాల్లోని 4.5కోట్ల ఆస్తులకు త్వరలో యాజమాన్య హక్కులు దక్కనున్నాయి. స్వామిత్వ స్కీమ్‌లో భాగంగా FY26 చివరికల్లా ప్రాపర్టీ టైటిల్స్ ఇవ్వాలని భావిస్తున్నట్లు కేంద్ర పంచాయతీరాజ్ అధికారులు తెలిపారు. APలోని 45లక్షల ఆస్తులకూ హక్కుపత్రాలు అందనున్నాయి. గ్రామాల్లో ఇళ్లు, స్థలాలకు ఆస్తి హక్కులు లేక రిజిస్ట్రేషన్ జరగడం లేదు. ప్రాపర్టీ టైటిల్‌తో క్రయవిక్రయాలకు, లోన్లకు వీలు కలగనుంది.
News November 1, 2025
NITCON లిమిటెడ్ 143 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

NITCON లిమిటెడ్ 143 డేటా ఎంట్రీ ఆపరేటర్(DEO), MTS పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఇంటర్ అర్హత గల అభ్యర్థులు నవంబర్ 6 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 45ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. DEO పోస్టులకు స్కిల్ టెస్ట్, రాత పరీక్ష, MTS పోస్టులకు షార్ట్ లిస్ట్, రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://nitcon.org/
News November 1, 2025
శనివారం రోజున చేయకూడని పనులు

శనివారం నాడు కొన్ని వస్తువులను ఇంటికి తీసుకెళ్లడం, కొన్ని పనులు చేయడం అశుభమని భావిస్తారు. అవి..
☞ శనివారం నాడు నువ్వుల నూనె, తోటకూర, చెప్పులు కొనుగోలు చేయకూడదు.
☞ ఉప్పు, నల్ల మినుములను (నల్ల మినప్పప్పు) ఇంటికి తీసుకురావడం శుభదాయకం కాదు.
☞ శనివారం బొగ్గులు, ఇనుము కూడా కొనకపోవడం ఉత్తమం.
☞ ఈ నియమాలు పాటిస్తే శని దేవుని ఆగ్రహం తగ్గుతుందని, అదృష్టం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.


