News March 18, 2025
తెలంగాణ ప్రభుత్వానికి బాంబే హైకోర్టు నోటీసులు

అనుమతి లేకుండా మహిళల ఫొటోల వినియోగం ఆందోళనకరమని, వాటిని ప్రభుత్వ ప్రకటనల్లో ఉపయోగించినా అది వాణిజ్య దోపిడీ కిందికే వస్తుందని బాంబే హైకోర్టు పేర్కొంది. అంగీకారం లేకుండా మహిళల ఫొటోలు ప్రకటనల్లో వాడుతున్నారనే నమ్రత అంకుశ్ అనే మహిళ పిటిషన్పై కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. దీనిపై ఈ నెల 24లోగా సమాధానం చెప్పాలని కేంద్రం, తెలంగాణ, MH, కర్ణాటక, ఒడిశా ప్రభుత్వాలు, కాంగ్రెస్ పార్టీ ఇతరులకు ఆదేశాలిచ్చింది.
Similar News
News March 18, 2025
అలా చేస్తే పృథ్వీ షాను మించిన వారు లేరు: శశాంక్ సింగ్

ముంబై క్రికెటర్ పృథ్వీషాపై పంజాబ్ కింగ్స్ ఫినిషర్ శశాంక్ సింగ్ ప్రశంసలు కురిపించారు. ‘షాతో నాకు 13ఏళ్ల పరిచయం. జైస్వాల్, గిల్ వంటివారు మంచి ఆటగాళ్లే. కానీ షా గనుక తిరిగి తన బ్యాటింగ్ బేసిక్స్ను గుర్తుతెచ్చుకుని ఆడితే తనను మించినవారు లేరు. కష్టం, ఫిట్నెస్, క్రమశిక్షణ, ఆటిట్యూడ్.. వీటి విలువ తెలుసుకుని తను గాడిలో పడాలి’ అని అభిలషించారు.
News March 18, 2025
నేటి నుంచే అంగన్వాడీల్లో ఒంటి పూట: మంత్రి

AP: ఎండల తీవ్రత నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాల్లో నేటి నుంచే ఒంటి పూట అమల్లోకి తీసుకొచ్చారు. ఉదయం 8 నుంచి 12 వరకు పిల్లలకు ప్రీ స్కూల్ నిర్వహించాలని మంత్రి సంధ్యారాణి ఆదేశించారు. పిల్లలకు మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించనున్నట్లు పేర్కొన్నారు.
News March 18, 2025
మంచు లక్ష్మి, కాజల్, రానాపై కేసుకు డిమాండ్!

టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చొరవతో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తోన్న యూట్యూబర్లు, సెలబ్రిటీలపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. నిన్న కూడా 11 మందిపై కేసు నమోదైంది. అయితే, మంచు లక్ష్మి సైతం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారని విమర్శలొస్తున్నాయి. బెట్టింగ్ యాప్ యాడ్స్లో నటించిన రానా, కాజల్, ప్రకాశ్రాజ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్?