News August 30, 2024

MBBS సీటు సాధించిన బోండా తెగ యువకుడు

image

ఒడిశాలోని బోండా తెగకు చెందిన మంగళ ముదులి (19) నీట్‌లో అర్హత సాధించి బెర్హంపూర్‌లోని మహారాజ కృష్ణచంద్ర గజపతి(MKCG) మెడికల్ కాలేజీలో అడ్మిషన్ పొందారు. బోండా తెగ నుంచి డాక్టర్‌ కాబోతున్న తొలి వ్యక్తిగా ఆయన నిలిచారు. ఆయన నీట్ కోచింగ్ కోసం ఓ టీచర్ ఆర్థిక సాయం చేశారు. ముదులి కుటుంబం అటవీ ఉత్పత్తులను అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. తమ తెగకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించడమే తన లక్ష్యమని ముదులి తెలిపారు.

Similar News

News November 18, 2025

GOOD NEWS: భారీగా ఉద్యోగాలు.. త్వరలో జాబ్ క్యాలెండర్

image

AP: నిరుద్యోగులకు శుభవార్త. త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటించేందుకు అన్ని శాఖల్లోని ఖాళీల సమాచారాన్ని ప్రభుత్వం సేకరిస్తోంది. ఇప్పటి వరకు 157 విభాగాల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కింద 99వేల పోస్టులు ఉన్నట్లు సమాచారం. పంచాయతీరాజ్ శాఖలో 26K, పట్టణాభివృద్ధిలో 23K, ఉన్నత విద్యలో 7K, స్కిల్ డెవలప్‌మెంట్‌లో 2,600, రెవెన్యూలో 2500, వ్యవసాయ శాఖలో 2,400, మహిళాభివృద్ధి విభాగంలో 1,820 ఖాళీలున్నట్లు తెలుస్తోంది.

జనవరిలో కొత్త ITR ఫారాలు: CBDT

image

కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఆదాయపు పన్ను చట్టం వచ్చే ఏడాది APR 1 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ చట్టంలో ఉన్న రూల్స్‌తో ITR ఫారాలను జనవరినాటికి అందుబాటులోకి తేనున్నట్లు CBDT వెల్లడించింది. పన్ను చెల్లింపు ప్రక్రియను సులభతరం చేయడమే లక్ష్యమని పేర్కొంది. కొత్త చట్టానికి అనుగుణంగా అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్లలో మార్పులు చేస్తున్నట్లు తెలిపింది. ఇక సరైన రిఫండ్ క్లెయిమ్‌లను DECలోగా పరిష్కరిస్తామని వివరించింది.