News March 17, 2024

ఒక సంస్థ నుంచే DMKకి ₹509 కోట్ల విలువైన బాండ్లు

image

ఎలక్టోరల్‌ బాండ్ల విషయంలో ‘ఫ్యూచర్‌ గేమింగ్‌ అండ్‌ హోటల్‌ సర్వీస్‌’ పేరు అందరినీ ఆకర్షించింది. ఆ సంస్థ అత్యధికంగా ₹1,368 కోట్ల విలువైన బాండ్లు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఆ కంపెనీ కొనుగోలు చేసిన బాండ్ల మొత్తంలో ₹509 కోట్లు తమిళనాడు CM స్టాలిన్ నేతృత్వంలోని DMK పార్టీ ఖాతాలోకి చేరడం విశేషం. ఈ విషయాన్ని EC తాజాగా వెల్లడించింది. ఒక పార్టీకి ఇంతపెద్ద మొత్తంలో బాండ్లు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

Similar News

News February 2, 2026

350 పోస్టులు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

image

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 350 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి CFA/CA, MBA, PGDBM, PGDBA, CAIIB, IIBF, CITF, NISM సర్టిఫికెట్‌తో పాటు పని అనుభవం ఉండాలి. FEO పోస్టుకు గరిష్ఠ వయసు 35ఏళ్లు కాగా, మార్కెటింగ్ ఆఫీసర్ పోస్టుకు 30ఏళ్లు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://centralbank.bank.in *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.

News February 2, 2026

మహిళలపై ఇన్ఫ్లమేషన్ ప్రభావం

image

ఇన్‌ఫ్లమేషన్ అంటే వాపు అని అర్థం. క్యాన్సర్, గుండె జబ్బులు, మధుమేహం, ఆర్థరైటిస్, డిప్రెషన్, అల్జీమర్స్ వంటి అనేక ప్రధాన వ్యాధులకు ఇది కారణం అవుతుంది. ముఖ్యంగా మహిళల్లో జననాంగాల్లో ఇన్ఫెక్షన్, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్, గర్భాశయంలో ఫైబ్రాయిడ్లు, జీర్ణ సమస్యలు, చర్మసమస్యలు వంటివి వస్తాయి. ఇన్‌ఫ్లమేషన్ తగ్గాలంటే స్వీట్లు, ప్రాసెస్డ్ ఫుడ్, మద్యపానానికి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

News February 2, 2026

దలైలామాకు గ్రామీ అవార్డు

image

టిబెట్‌ బౌద్ధమతగురువు దలైలామా ప్రతిష్ఠాత్మక గ్రామీ అవార్డును గెలుచుకున్నారు. బెస్ట్‌ ఆడియో బుక్‌ నెరేషన్‌ విభాగంలో ‘మెడిటేషన్’ అనే ఆల్బమ్‌కు ఈ అవార్డు దక్కింది. ఇందులో ఆయన తన ఆలోచనలు, సందేశాలను ఆడియో రూపంలో అందించారు. సంగీత రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఈ అవార్డును 90 ఏళ్ల వయసులో గెలుచుకున్నారు. ఈ అవార్డును దలైలామా తరఫున ప్రముఖ సంగీతకారుడు రూఫస్ వేన్‌రైట్ స్వీకరించారు.