News June 16, 2024
బోణీ కొట్టిన జర్మనీ, స్విట్జర్లాండ్, స్పెయిన్

జర్మనీలో యూరో చాంపియన్ షిప్-2024 టోర్నీ తొలి రోజు జరిగిన మ్యాచుల్లో జర్మనీ, స్విట్జర్లాండ్, స్పెయిన్ విజయం సాధించాయి. తొలి మ్యాచులో స్కాట్లాండ్పై ఆతిథ్య జర్మనీ 5-1 తేడాతో బోణి కొట్టింది. మరో మ్యాచులో హంగేరీపై స్విట్జర్లాండ్ 3-1 పాయింట్ల తేడాతో గెలిచింది. ఇక క్రొయేషియాపై స్పెయిన్ 3-0తేడాతో విజయం సాధించింది. ఈ సారి 24 జట్లు టైటిల్ పోరుకు సిద్ధమవ్వగా, ఆరు గ్రూపులుగా విభజించారు.
Similar News
News November 26, 2025
చటేశ్వర్ పుజారా బావమరిది ఆత్మహత్య

భారత మాజీ క్రికెటర్ చటేశ్వర్ పుజారా బావమరిది జీత్ పబారీ ఆత్మహత్య చేసుకున్నారు. గుజరాత్ రాజ్కోట్లోని తన నివాసంలో ఉరేసుకున్నారు. అతడిని పెళ్లి చేసుకోవాలనుకున్న యువతి పబారీపై గతేడాది అత్యాచారం కేసు పెట్టింది. అప్పటి నుంచి ఆ కేసు విచారణలో ఉండగా ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. పుజారా భార్య పూజ సోదరుడే జీత్ పబారీ.

ముస్లింలు మాకు ఓటు వేయట్లేదు: కేరళ BJP చీఫ్

BJPకి ముస్లింలు ఓట్లు వేయకపోవడం వల్లే క్యాబినెట్లో ముస్లిం కమ్యూనిటీకి ప్రాతినిధ్యం లేదని కేంద్ర మాజీ మంత్రి, కేరళ BJP చీఫ్ రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. ‘ముస్లింలు మాకు సపోర్టు చేయకపోతే మేమేం చేయాలి. మా పార్టీలో ఆ కమ్యూనిటీ నుంచి ఒక్క MP కూడా లేరు. అందుకే క్యాబినెట్లో చోటు దక్కలేదు’ అని కోజికోడ్లో చెప్పారు. వారు కాంగ్రెస్కు ఎందుకు ఓటు వేస్తున్నారని, దాని వల్ల ప్రయోజనం ఉందా అని ప్రశ్నించారు.