News October 18, 2024

బోణి కొట్టిన తెలుగు టైటాన్స్

image

ప్రోకబడ్డీ లీగ్ 11వ సీజన్ తొలి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ బోణీ కొట్టింది. బెంగళూరు బుల్స్‌తో జరిగిన మ్యాచులో 37-29 పాయింట్ల తేడాతో గెలుపొందింది. తెలుగు టైటాన్స్ కెప్టెన్ పవన్ షెరావత్ 13 పాయింట్లు రాబట్టడం గమనార్హం. ప్రో కబడ్డీ లీగ్‌లో పవన్ రికార్డు స్థాయిలో 1,200 పాయింట్లు సాధించారు. మరోవైపు రేపు రాత్రి 8 గంటలకు తమిళ్ తలైవాస్‌తో టైటాన్స్ రెండో మ్యాచ్ ఆడనుంది.

Similar News

News October 19, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: అక్టోబర్ 19, శనివారం
ఫజర్: తెల్లవారుజామున 4:58 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:10 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:01 గంటలకు
అసర్: సాయంత్రం 4:14 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 5:52 గంటలకు
ఇష: రాత్రి 7.04 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News October 19, 2024

సర్ఫరాజ్ రేపు డబుల్ సెంచరీ కొడతారు: కుల్‌దీప్

image

బెంగళూరు టెస్టులో న్యూజిలాండ్‌కు భారత్ దీటుగా బదులిస్తున్న సంగతి తెలిసిందే. టీమ్ ఇండియా ఆశలు సర్ఫరాజ్ ఖాన్‌పై ఉన్నాయని స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ అన్నారు. ‘ఇరానీ ట్రోఫీలో అతడి డబుల్ సెంచరీ అందరం చూశాం. అలాంటి ఇన్నింగ్సే రేపు ఆశిస్తున్నాం. స్పిన్నర్లపై అతడి టెక్నిక్ అద్భుతం. వారిని కుదురుకోనివ్వకుండా ఆడతారు. న్యూజిలాండ్ స్పిన్నర్లపై ఎదురుదాడి చేస్తున్నారు’ అని ప్రశంసించారు.

News October 19, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.