News November 23, 2024

బ్యాంకు అకౌంట్లలోకి బోనస్ నగదు

image

TG: సన్నవడ్లను మార్కెట్లో ప్రభుత్వానికి విక్రయించిన రైతుల ఖాతాల్లో బోనస్ నగదు జమవుతోంది. క్వింటాకు రూ.500 చొప్పున బ్యాంకు అకౌంట్లలో డబ్బు జమైనట్లు ఖమ్మం, జగిత్యాల జిల్లాల్లో పలువురు రైతుల ఫోన్లకు SMSలు వచ్చాయి. సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్లతో మెసేజ్లు వస్తున్నట్లు మరికొందరు రైతులు చెబుతున్నారు. సన్న వడ్లను దళారులకు విక్రయించవద్దని, ప్రభుత్వానికే అమ్మాలని అధికారులు కోరుతున్నారు.

Similar News

News December 6, 2025

TGపై పవన్ వ్యాఖ్యలు సరికాదు: ఉండవల్లి

image

AP: తెలంగాణపై పవన్ కళ్యాణ్ <<18394542>>దిష్టి<<>> వ్యాఖ్యలు సరికాదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. డిప్యూటీ సీఎం స్థాయి నేత మాట్లాడేటప్పుడు ఆలోచించుకోవాలని హితవు పలికారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు తీసుకొస్తున్న చంద్రబాబు తన వ్యాపారాలను ఏపీకి ఎందుకు తీసుకురావట్లేదని ప్రశ్నించారు. BJP, జనసేన, TDP పొత్తు ఎంతకాలం కొనసాగుతుందో చూడాలన్నారు. మరోవైపు అమరావతి రాజధానికి తాను వ్యతిరేకం కాదన్నారు.

News December 6, 2025

విజయోత్సవాల పేరిట ప్రజాధనం వృథా: హరీశ్

image

TG: కాంగ్రెస్ పాలన రైతుల పాలిట శాపంగా మారిందని BRS నేత హరీశ్ రావు విమర్శించారు. ‘రైతులకు యూరియా సరఫరా చేయలేని రేవంత్.. విజయోత్సవాల పేరిట ప్రజాధనం వృథా చేస్తున్నారు. చేసిందేమీ లేక గప్పాలు కొట్టారు. గ్లోబల్ సమ్మిట్, విజన్ 2047 అంటూ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్న CM ముందు యూరియా సరఫరాపై దృష్టి పెట్టాలి. క్యూలైన్లలో రైతులు నరకం చూస్తున్నారు’ అని మండిపడ్డారు.

News December 6, 2025

ఇండిగోపై కేంద్రం సీరియస్.. మీటింగ్‌కు రావాలని ఆదేశం

image

ప్రయాణికులను ఇబ్బంది పెట్టిన ఇండిగో యాజమాన్యంపై కేంద్ర విమానయాన శాఖ మరోసారి సీరియస్ అయింది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు నిర్వహించే సమావేశానికి హాజరుకావాలని ఇండిగో యాజమాన్యాన్ని ఆదేశించింది. రద్దు చేసిన టికెట్ ఛార్జీలను రేపు సాయంత్రం 8 గంటల లోపు రిటర్న్ చేయాలని ఇప్పటికే సూచించింది.