News October 7, 2024
సింగరేణి కార్మికులకు బోనస్ చెక్కులు అందజేత

TG: ప్రభుత్వం సింగరేణి కార్మికులకు ప్రకటించిన బోనస్ చెక్కులను ప్రజా భవన్‌లో మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, పొంగులేటి వారికి అందజేశారు. రూ.796కోట్ల విలువైన చెక్కులను ఇవ్వగా ఒక్కో కార్మికుడికి సగటున రూ.1.90లక్షల బోనస్ అందింది. సింగరేణిలోని ఒప్పంద ఉద్యోగులకు రూ.5వేల బోనస్ ఇస్తామని భట్టి అన్నారు. సింగరేణి ప్రాంతాల్లో కార్పొరేట్ ఆసుపత్రులు కట్టాల్సిన అవసరం ఉందని పొంగులేటి అన్నారు.
Similar News
News March 31, 2026
పంచాయతీలకు గుడ్‌న్యూస్.. ₹247Cr విడుదల

TG: గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం తొలి విడతగా ₹247.94 కోట్ల నిర్దిష్ట నిబంధనలు లేని నిధులను (Untied Grants) విడుదల చేసింది. వీటిని గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, మురుగునీటి శుద్ధి, వర్షపు నీటి సంరక్షణ వంటి పనుల కోసం వాడుకోవచ్చు. అలాగే గ్రామాలను ఓపెన్ డెఫికేషన్ (బహిరంగ మలవిసర్జన) ఫ్రీగా మార్చడానికి, చెత్తాచెదారం క్లీన్ చేయడానికి ఈ నిధులను ఉపయోగించుకునే వీలుంటుంది.

రీల్స్ చేస్తూ బాలిక మృతి

AP: తిరుపతిలో దారుణ ఘటన జరిగింది. అలిపిరి PS పరిధిలో ఉన్న రాజారెడ్డినగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్ కూతురు (13) రీల్స్ చేస్తూ ఐదో అంతస్తు నుంచి పడి మృతిచెందింది. నేపాల్‌కు చెందిన ఈ ఫ్యామిలీ స్థానికంగా నివాసం ఉంటోంది. పోలీసులు కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నారు. సోషల్ మీడియా క్రేజ్ కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవడం బాధాకరం. సరదా కోసం చేసే పనులు ఇలా ప్రాణాలు తీయడం అందరినీ కలచివేస్తోంది.