News February 18, 2025
ప్రతి ఉద్యోగికి రూ.4లక్షల బోనస్

లాభాలను ఉద్యోగులకు పంచే కంపెనీలు కొన్నే ఉంటాయి. పారిస్‌కు చెందిన ప్రముఖ లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ హెర్మేస్ ఆ కోవలోకి వస్తుంది. గతేడాది తమ కంపెనీకి అసాధారణ లాభాలు రావడంతో ప్రతి ఉద్యోగికి రూ.4లక్షల బోనస్ ఇవ్వాలని నిర్ణయించింది. వివిధ దేశాల్లో వ్యాపారం చేస్తున్న ఈ కంపెనీలో 25k మంది పని చేస్తున్నారు. అంతర్జాతీయంగా తన బ్రాండ్‌ను విస్తరించి నమ్మకమైన కస్టమర్ బేస్ సంపాదించుకోవడమే భారీ లాభాలకు కారణమయ్యాయి.
Similar News
News November 11, 2025
వైసీపీ పాలనలో పారిశ్రామికవేత్తలు పారిపోయారు: సీఎం

AP: సంక్షేమం, అభివృద్ధిలో ఏపీ బ్రాండ్‌ను మళ్లీ తీసుకొస్తున్నామని CM చంద్రబాబు చెప్పారు. ప్రతి ఇంట్లో ఓ పారిశ్రామికవేత్త ఉండాలనేది తమ లక్ష్యమన్నారు. ప్రకాశం(D) కనిగిరిలో MSMEల ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. ‘YCP పాలనలో బెదిరింపులతో పారిశ్రామికవేత్తలు పారిపోయారు. మా హయాంలో పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ప్రతి 50కి.మీలకు ఒక పోర్టు నిర్మిస్తాం’ అని పేర్కొన్నారు.
News November 11, 2025
ఆగాకర సాగు – అనుకూల పరిస్థితులు

ఆగాకర తీగజాతి పంట. అన్ని రకాల నేలల్లో ఈ పంటను సాగు చేయవచ్చు. అధిక కర్బన పదార్థం, మురుగు నీటి వసతి ఉన్న ఒండ్రు కలిగిన ఇసుక నేలలు ఈ పంట సాగుకు చాలా అనుకూలం. ఉదజని సూచిక 6-7 ఉన్న నేలలు సాగుకు అనువైనవి. ఆగాకర అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోగలదు. తేమతో కూడిన వెచ్చని వాతావరణంలో పంట పెరుగుదల బాగుంటుంది. 32-40 డిగ్రీల సెంటీగ్రేడు ఉష్ణోగ్రతల మధ్య అధిక దిగుబడిని, నాణ్యతను పొందవచ్చు.
News November 11, 2025
యాక్టివేటెడ్ చార్‌కోల్‌తో ఎన్నో లాభాలు

ప్రస్తుత కాలంలో ఫేస్ క్రీం, ఫేస్ వాష్ ఎందులో చూసినా యాక్టివేటెడ్ చార్‌కోల్ ఉంటోంది. దీంతో చాలా ప్రయోజనాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. * ఇది ఓపెన్ పోర్స్‌ను అన్‌క్లాగ్ చేస్తుంది. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ తొలగించడానికి ఇది బాగా పని చేస్తుంది. * మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేయడంలో యాక్టివేటెడ్ చార్‌కోల్ కీలక పాత్ర పోషిస్తుంది. పొడిబారిన చర్మానికి తేమను అందిస్తుంది.


