News November 22, 2024

బోనస్ మాట బోగస్ అయింది: హరీశ్ రావు

image

TG: ఈనాం కొనుగోలు కేంద్రాల ద్వారా పత్తి కొనుగోలు చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. రూ.500 బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ మాట బోగస్ అయిందని ఖమ్మం పత్తి మార్కెట్లో ఆరోపించారు. జిల్లాలో ముగ్గురు మంత్రులున్నా రైతుల సమస్యలపై సమీక్ష చేసే తీరిక లేదన్నారు. పెట్టుబడి సాయం ఇవ్వకపోగా మద్దతు ధర లేదని, రైతులకు రుణమాఫీ చేయలేదని ఆరోపించారు. ప్రతిపక్షాలపై కేసులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారని హరీశ్ రావు విమర్శించారు.

Similar News

News November 22, 2024

ఆసియా కప్ ప్రసార హక్కులు సోనీకే?

image

ఆసియా కప్ ప్రసార హక్కులు సోనీ నెట్‌వర్క్‌కు దక్కినట్లు తెలుస్తోంది. 2031 వరకు ఆ సంస్థ మ్యాచులను ప్రసారం చేస్తుందని సమాచారం. కాగా వచ్చే ఏడాది నవంబర్ నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుంది. దుబాయ్‌లో జరిగే ఈ మ్యాచులను సోనీ లైవ్ టెలికాస్ట్ చేయనుంది.

News November 22, 2024

AR రెహమాన్‌ కుమారుడు ఎమోషనల్ పోస్ట్

image

భార్య సైరా బానుతో విడిపోతున్నట్లు మ్యూజిక్ డైరెక్టర్ AR రెహమాన్‌ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయనపై వస్తున్న రూమర్స్ పట్ల కుమారుడు ఏఆర్ అమీన్ స్పందించారు. ‘నా తండ్రి లెజెండ్. ఆయన విలువలు పాటిస్తూ ఎనలేని గౌరవం, ప్రేమను సంపాదించారు. నా తండ్రిపై అసత్య, అర్థరహిత వార్తలు చూస్తే బాధేస్తోంది. తప్పుడు సమాచారం వ్యాప్తిని మానుకొని, ఆయన మనపై చూపిన ప్రభావం పట్ల గౌరవంగా ఉందాం’ అని పోస్ట్ చేశారు.

News November 22, 2024

సబ్‌మెరైన్‌ను ఢీకొట్టిన చేపల వేట పడవ

image

గోవాలో ఓ సబ్‌మెరైన్‌ను చేపల వేట సాగించే పడవ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మత్స్యకారులు గల్లంతయ్యారు. 11 మందిని అధికారులు రక్షించారు. ఈ ఘటన గోవాకు 70 నాటికల్ మైళ్ల దూరంలో చోటుచేసుకుంది. కాగా సబ్‌మెరైన్‌కు జరిగిన నష్టంపై నేవీ అధికారులు అంచనా వేస్తున్నారు. దీనిపై హై లెవెల్ విచారణ కొనసాగుతోంది. కాగా ఈ జలాంతర్గామి నేవీలో వివిధ రకాల ఆపరేషన్లు నిర్వహిస్తుంది. శబ్దం లేకుండా ప్రయాణించడం దీని ప్రత్యేకత.