News April 14, 2025

బుకింగ్స్ వివాదం.. OYO ఫౌండర్‌పై కేసు నమోదు

image

OYO ఫౌండర్ రితేశ్ అగర్వాల్‌పై రాజస్థాన్‌లో కేసు నమోదైంది. తప్పుడు సమాచారంతో మోసం చేశారని జైపూర్‌కు చెందిన సంస్కార రిసార్ట్స్ యజమాని మాధవ్ జైన్ ఫిర్యాదు చేశారు. 2019లో ఓయోతో సంవత్సర కాలానికి ఒప్పందం చేసుకున్నామన్నారు. కానీ 2019-20, 2020-21లోనూ తమ రిసార్ట్స్‌ బుకింగ్స్‌ ఓయోలో చూపించారన్నారు. దీంతో రూ.2.66 కోట్ల GST బిల్లు పెండింగ్‌లో ఉన్నట్లు నోటీసులు వచ్చాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Similar News

News February 1, 2026

CM కీలక నిర్ణయం: ఫలితాల తర్వాతే ఛైర్మన్లపై ప్రకటన

image

TG: పురపాలక ఛైర్మన్, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థుల ఎంపికపై CM రేవంత్ రెడ్డి వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాతే ఛైర్మన్, మేయర్ అభ్యర్థులను ప్రకటించాలని నాయకులను ఆదేశించారు. ఎన్నికలకు ముందే పేర్లు ప్రకటిస్తే పార్టీ ఇబ్బందుల్లో పడుతుందని సీఎం హెచ్చరించారు. చాలా మంది నాయకులు ఈ పదవుల కోసం డిమాండ్ చేస్తున్నారు.

News February 1, 2026

బడ్జెట్‌ ప్రసంగంలో పారదర్శకత లేదు: కాంగ్రెస్

image

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఆర్థికమంత్రి ప్రసంగంలో పారదర్శకత లేదని, కేటాయింపులపై స్పష్టత లేదని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ విమర్శించారు. బడ్జెట్ అంచనాలను అందుకోలేదన్నారు. ఈ బడ్జెట్ కేవలం దేశంలోని 5% మంది కోసమే రూపొందించినట్లు ఉందని సమాజ్‌వాదీ నేత, ఎంపీ అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు.

News February 1, 2026

వీటి ధరలు తగ్గే ఛాన్స్!

image

ఎలక్ట్రిక్ వెహికల్స్ బ్యాటరీల తయారీకి సంబంధించిన పరికరాలపై కేంద్రం కస్టమ్స్ డ్యూటీ తొలగించింది. దీంతో ఈవీ ధరలు తగ్గే ఛాన్స్ ఉంది. మైక్రోవేవ్ ఓవెన్ పరికరాలు, సోడియమ్ యాంటీమోనేట్‌‌‌పైనా కస్టమ్స్ డ్యూటీ తొలగించింది. దీంతో మైక్రోవేవ్ ఓవెన్స్, సోలార్ గ్లాస్ ధరలు తగ్గనున్నాయి. సీఫుడ్ ధరలు తగ్గనున్నాయి. న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్స్, ఏవియేషన్‌కు సంబంధించిన ముడిసరకులపైన కేంద్రం పన్ను మినహాయింపు ఇచ్చింది.