News May 20, 2024
బ్యాంకింగ్ రంగంలో జోరు.. ప్రధాని మోదీ హర్షం

గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో బ్యాంకింగ్ రంగం రికార్డ్ స్థాయిలో రూ.3లక్షల కోట్ల నికర లాభాన్ని నమోదు చేయడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చినప్పుడు బ్యాంకులు నష్టాల్లో కూరుకుపోయాయని, UPA సర్కార్ ఫోన్ బ్యాంకింగ్ పాలసీనే ఇందుకు కారణమని తెలిపారు. ప్రైవేట్ బ్యాంకులు రూ.1.78లక్షల కోట్లు, పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు రూ.1.41 లక్షల కోట్ల నికర లాభాన్ని ఆర్జించాయి.
Similar News
News November 10, 2025
డెబిట్ కార్డు ఉంటే చాలు.. మరణిస్తే రూ.10లక్షలు

చాలా బ్యాంకులు డెబిట్ కార్డులపై ఉచిత వ్యక్తిగత ప్రమాద బీమా అందిస్తాయి. కార్డు రకాన్ని బట్టి కవరేజ్ ₹10 లక్షలు, అంతకంటే ఎక్కువ కూడా ఉంటుంది. బ్యాంకును బట్టి రూల్స్ వేరుగా ఉన్నాయి. ఫీజును బట్టి కవరేజ్ ఉంది. కొన్ని బ్యాంకుల్లో ATM వాడితేనే అర్హులు. వ్యక్తి మరణిస్తే నామినీ బ్యాంకుకు వెళ్లి డెత్ సర్టిఫికెట్, FIR, పోస్ట్ మార్టం నివేదికతో దరఖాస్తు చేసుకోవాలి. మరింత సమాచారం కోసం బ్యాంకును సంప్రదించండి.
News November 10, 2025
కొత్త ఆధార్ యాప్ తీసుకొచ్చిన UIDAI.. ఫీచర్స్ ఇవే

కొత్త ఆధార్ యాప్ను UIDAI తీసుకొచ్చింది. ఆధార్ వివరాలను ఫోన్లో స్టోర్ చేసుకునేందుకు, ఇతరులతో పంచుకునేందుకు రూపొందించినట్లు Xలో పేర్కొంది. ప్లేస్టోర్, యాపిల్ స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఆధార్లోని ఎంపిక చేసిన వివరాలనే షేర్ చేసుకునే సదుపాయం ఇందులో ఉండటం విశేషం. మిగతా సమాచారం హైడ్ చేయవచ్చు. అలాగే బయోమెట్రిక్ వివరాలను లాక్ లేదా అన్ లాక్ చేసుకోవచ్చు. ఫేస్ అథెంటికేషన్ ఫీచర్ కూడా ఉంది.
News November 10, 2025
తెలంగాణ న్యూస్ రౌండప్

☛ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అజహరుద్దీన్.. సచివాలయంలో ప్రార్థనల అనంతరం బాధ్యతలు
☛ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ సీఈసీకి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్.. పాల్గొన్న హరీశ్ రావు, తలసాని
☛ వరద ప్రవాహంతో నిలిచిపోయిన ఏడుపాయల వనదుర్గ ఆలయం దర్శనాలు పునఃప్రారంభం


