News August 6, 2024

విజృంభిస్తున్న వైరల్ ఫీవర్స్

image

TG: రాష్ట్రంలో వైరల్ ఫీవర్స్ విజృంభిస్తున్నాయి. ఏ ఇంట్లో చూసినా ఎవరో ఒకరు జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ కనిపిస్తున్నారు. డెంగీ, మలేరియా, టైఫాయిడ్ ఇలా జ్వరమేదైనా ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. పేషెంట్లతో హాస్పిటల్స్ కిటకిటలాడుతున్నాయి. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ చేపట్టిన ఫీవర్ సర్వేలోనూ జ్వరాల బాధితుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నట్లు వెల్లడైంది.

Similar News

News January 18, 2026

జగన్ ఉన్మాదానికి మరో BC నేత బలి: TDP

image

AP: మరో బీసీ నేతను జగన్ ఉన్మాదం బలి తీసుకుందని TDP మండిపడింది. కాకినాడ జిల్లా అల్లిపూడి గ్రామానికి చెందిన TDP నాయకుడి బర్త్‌డే వేడుకలకు వెళ్లి వస్తున్న బీసీ నేత లాలం బంగారయ్యను YCP నేతలు హత్య చేశారని ఆరోపించింది. బీసీ నేతలే టార్గెట్‌గా YCP చేస్తున్న దాడులు, హత్యలను కూటమి ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని చెప్పింది. అధికారం దక్కలేదనే పగతో ప్రజలను జగన్ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించింది.

News January 18, 2026

మెస్రం వంశీయుల ఆచారాలు

image

నాగోబా జాతరను మెస్రం వంశీయులు నిర్వహిస్తారు. కఠిన నియమాలు పాటిస్తారు. కొత్తగా పెళ్లైన కోడళ్లను నాగోబా స్వామికి పరిచయం చేసే భేటింగ్ ఆచారం ప్రత్యేకమైనది. ఈ పూజ తర్వాతే వారు వంశంలో పూర్తిస్థాయి సభ్యులుగా గుర్తింపు పొందుతారు. అలాగే, జాతర కోసం గోదావరి నుంచి నీరు తెచ్చేటప్పుడు వీరు చెప్పులు వేసుకోకుండా కాలినడకన ప్రయాణిస్తారు. కులదైవం పట్ల వారికున్న అపారమైన భక్తికి, వంశ గౌరవానికి ఈ ఆచారాలు నిదర్శనం.