News March 17, 2024

బొప్పూడి బహిరంగ సభకు ‘ప్రజాగళం’గా నామకరణం

image

చిలకలూరిపేట మండలం బొప్పూడిలో జరిగే టీడీపీ-జనసేన-బీజేపీ బహిరంగ సభకు ‘ప్రజాగళం’గా నామకరణం చేశారు. 300 ఎకరాల్లో సభ నిర్వహించనున్నట్లు టీడీపీ శ్రేణులు తెలిపాయి. ఎస్పీజీ నిఘాలో సభా వేదిక, హెలీప్యాడ్ల నిర్మాణం జరుగుతోంది. మోదీ, చంద్రబాబు, పవన్‌లు ప్రత్యేక హెలికాప్టర్లలో సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు. ఎండాకాలం కావడంతో సభా సమయంలో అత్యవసర వైద్య సేవల కోసం చిలకలూరిపేటలో ఓ ఆస్పత్రిని సిద్ధం చేశారు.

Similar News

News October 21, 2025

ప్రజల్లో సంతృప్తికర స్థాయి పెరగాలి: సీఎం చంద్రబాబు

image

ఆర్టీజీఎస్‌లో ప్రభుత్వ శాఖలు అందిస్తున్న వివిధ పౌర సేవలు, సంక్షేమ పథకాలపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఇబ్బందులు లేకుండా ప్రజలకు అందే సేవలు, వారిలో సంతృప్తి స్థాయి సాధించే అంశంపై సమీక్షలో ప్రధానంగా చర్చించారు. సమాచార శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి, సీఎస్ విజయానంద్, ఐటీ, ఆర్టీజీ, ఆర్ధిక, ప్రణాళిక శాఖ ఉన్నతాధికారులు సమీక్షకు హాజరయ్యారు.

News October 21, 2025

మెప్మా-మన మిత్ర యాప్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు

image

మహిళా సాధికారత కోసం ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ఎన్ని రంగాల్లో అవకాశాలు ఉంటే.. అన్ని రంగాలను ఉపయోగించుకోవాలని సీఎం సూచించారు. రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలకు అన్ని రకాల చేయూత ఇవ్వాలని ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సెర్ప్, మెప్మా విభాగాలపై సీఎం సమీక్ష నిర్వహించి మన మిత్ర యాప్‌ను ప్రారంభించారు.

News October 21, 2025

పంటపొలాలకు సాగునీటి పై దృష్టి పెట్టాలి: కలెక్టర్

image

జిల్లాలోని పంట పొలాలకు సాగునీరు సక్రమంగా అందించేలా చొరవ తీసుకోవాలని కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని వీసీ హాలులో జలవనరుల శాఖ అధికారులతో మంగళవారం కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. సాగు నీటి కాలువలు కింద ఉన్న తాగునీటి చెరువులను నింపుటకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. గుంటూరు ఛానల్ అభివృద్ధికి భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు.