News March 24, 2025

బోరుగడ్డ అనిల్‌కు వచ్చే నెల 4 వరకూ రిమాండ్

image

బోరుగడ్డ అనిల్‌కు నరసరావు పేట కోర్టు వచ్చే నెల 4 వరకు రిమాండ్ విధించింది. ఫిరంగిపురం పోలీసులు ఈరోజు ఆయన్ను పీటీ వారెంట్‌పై సివిల్ జడ్జి వద్ద హాజరుపరచగా ఆయన రిమాండ్ విధించారు. కాగా అనిల్ ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే.

Similar News

News March 27, 2025

సంపాదనలో రష్మిక మందన్న టాప్

image

నేషనల్ క్రష్ రష్మిక మందన్న రూ.70 కోట్ల ఆస్తులు సంపాదించినట్లు ఫోర్బ్స్ సంస్థ తెలిపింది. త్వరలోనే ఇది రూ.100 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. ఆమెకు హైదరాబాద్, బెంగళూరు, కూర్గ్, ముంబై, గోవాలో సొంత ఇళ్లు ఉన్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఆమె ఒక్కో సినిమాకు రూ.10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని వెల్లడించాయి. దక్షిణాదిలో సంపాదనపరంగా రష్మికనే నంబర్‌వన్ అని చెప్పాయి.

News March 27, 2025

రిజర్వాయర్లలో పడిపోయిన నీటిమట్టాలు

image

దేశంలోని ప్రధాన రిజర్వాయర్లలో నీటిమట్టాలు 45 శాతానికి పడిపోయినట్లు CWC నివేదిక ద్వారా తెలుస్తోంది. ఉత్తరాదిలో అయితే 25 శాతానికి పడిపోయాయి. దేశవ్యాప్తంగా ఉన్న 155 ప్రధాన జలాశయాల సామర్థ్యం 18,080 బీసీఎంలు ఉండగా ప్రస్తుతం 8,070 బీసీఎంలు మాత్రమే నిల్వ ఉన్నాయి. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏప్రిల్-మే నెలల్లో ఈ నీటి నిల్వలు మరింతగా అడుగంటనున్నాయి.

News March 27, 2025

పెరిగిన బంగారం ధరలు

image

వరుసగా రెండో రోజు బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.400 పెరిగి రూ.82,350లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.440 పెరగడంతో రూ.89,840 వద్ద కొనసాగుతోంది. అటు వెండి ధరలో మాత్రం ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ.1,11,000గా ఉంది.

error: Content is protected !!