News January 2, 2025
బోరుగడ్డ అనిల్ బెయిల్ పిటిషన్ కొట్టివేత

AP: సోషల్ మీడియా కేసులో బోరుగడ్డ అనిల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. పిటిషనర్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారా? అని కోర్టు వ్యాఖ్యానించినట్లు సమాచారం. అటు, పిటిషనర్ నేరచరిత్ర కలిగి ఉన్నాడని, అతనిపై 2 ఛార్జ్షీట్లు నమోదయ్యాయని పోలీసులు కోర్టుకు చెప్పారు. ఇలాంటి కేసుల్లో నిందితులను క్షమించడానికి వీల్లేదని కోర్టు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.
Similar News
News January 10, 2026
అమెరికాలో కాల్పులు.. ఆరుగురు మృతి

అమెరికాలో మరోసారి కాల్పులు చోటుచేసుకున్నాయి. మిసిసిపీలోని క్లే కౌంటీలో దుండగుడు జరిపిన ఫైరింగ్లో ఆరుగురు చనిపోయారు. మూడు వేర్వేరు ప్రాంతాల్లో అతడు దాడి చేసినట్లు అధికారులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. కాల్పులు జరిపింది ఎవరు, ఎందుకు చేశాడనే దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News January 10, 2026
బంగ్లా-పాక్ మధ్య విమానాలు.. కేంద్రం పర్మిషన్ ఇస్తుందా?

పాక్కు ఈ నెల 29 నుంచి బంగ్లాదేశ్ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఇండియన్ ఎయిర్ స్పేస్ నుంచే అవి వెళ్లాల్సి ఉంటుంది. దీంతో బంగ్లా విమానాలకు కేంద్రం పర్మిషన్ ఇస్తుందా అనేది కీలకంగా మారింది. పాక్ విమానాలు మన గగనతలం నుంచి వెళ్లడంపై నిషేధం ఉంది. ఈ క్రమంలో ఒకవేళ కేంద్రం ఒప్పుకోకపోతే 2,300KM వెళ్లాల్సిన విమానాలు 5,800KM మేర చుట్టేసుకుని పోవాల్సి ఉంటుంది. 3 గంటల జర్నీ కాస్తా 8 గంటలకు పెరగనుంది.
News January 10, 2026
విజయవాడ, గుంటూరు, మంగళగిరి, అమరావతి కలిసిపోతాయి: సీఎం

AP: ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ యూనివర్సిటీలను అమరావతికి తీసుకొస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. రాబోయే 6 నెలల్లోనే క్వాంటం కంప్యూటర్ అమరావతి నుంచి పనిచేయటం ప్రారంభిస్తుందన్నారు. కొందరు అమరావతి నిర్మాణ వేగాన్ని చూసి అసూయ చెందుతున్నారని విమర్శించారు. విజయవాడ, గుంటూరు, మంగళగిరి, అమరావతి.. అన్నీ కలిసిపోయి ఒక బెస్ట్ లివబుల్ సిటీగా తయారవుతుందని ఓ కాలేజీ వార్షికోత్సవ సభలో వివరించారు.


