News October 1, 2024
భారత క్రికెట్‌కు వారిద్దరూ భవిష్యత్ స్టార్లు: అశ్విన్

టీమ్ ఇండియాకు గిల్, జైస్వాల్ భవిష్యత్ స్టార్లుగా నిలుస్తారని భారత బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ జోస్యం చెప్పారు. ‘జైస్వాల్, గిల్‌కు స్పెషల్ టాలెంట్ ఉంది. ఇద్దరూ స్వేచ్ఛగా ఆడతారు. ప్రస్తుతం కెరీర్ ఆరంభ దశలోనే ఉన్నారు కానీ మున్ముందు వారు మూలస్తంభాలుగా మారతారు. వారికి మా అనుభవాలను కూడా చెబుతాం. ఇద్దరూ నాణ్యమైన ఆటగాళ్లే. మరింత అనుభవంతో ఇంకా రాటుదేలతారు’ అని ధీమా వ్యక్తం చేశారు.
Similar News
News October 16, 2025
PHOTO GALLERY: మోదీ ఏపీ పర్యటన

AP: ప్రధాని మోదీ ఇవాళ ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించారు. తొలుత శ్రీశైలంలో భ్రమరాంబికా దేవి, మల్లికార్జున స్వామి వార్లకు పూజలు చేశారు. అనంతరం గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్, కేంద్రమంత్రులు రామ్మోహన్, పెమ్మసాని, భూపతి రాజులతో కలిసి బహిరంగ సభలో పాల్గొన్నారు. మోదీ పర్యటన ఫొటోలను పైన గ్యాలరీలో చూడండి.
News October 16, 2025
3 కొత్త అగ్రికల్చర్ కాలేజీలు.. ఇక్కడే

TG: జయశంకర్ వర్సిటీకి అనుబంధంగా కొత్తగా 3 వ్యవసాయ కళాశాలల ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. నల్గొండ, నిజామాబాద్, వికారాబాద్ జిల్లాల్లో ఈ కాలేజీలను నిర్మించనుంది. అటు రూ.10,500 కోట్లతో 5,500 కిలోమీటర్ల హ్యామ్ రోడ్ల నిర్మాణానికి మంత్రివర్గం పచ్చజెండా ఊపింది.
News October 16, 2025
డిసెంబర్ 1 నుంచి ప్రజాపాలన ఉత్సవాలు.. కొత్త అప్లికేషన్ల స్వీకరణ

TG: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా DEC 1-9 వరకు ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాలు నిర్వహించాలని క్యాబినెట్ నిర్ణయించింది. గ్రామగ్రామాన జరిగే ఈ ఉత్సవాల్లో పలు సంక్షేమ పథకాలకు దరఖాస్తులు తీసుకోనున్నారు. ఏయే పథకాలకు అప్లికేషన్లు స్వీకరించాలనే అంశంపై రెండు రోజుల్లో సీఎస్ అధ్యక్షతన సమావేశమై వివరాలు వెల్లడించనున్నారు.