News May 23, 2024
బీజేపీ, స్టాక్ మార్కెట్ రెండూ సరికొత్త రికార్డులు సృష్టిస్తాయి: మోదీ

జూన్ 4న BJP, స్టాక్ మార్కెట్ రెండూ సరికొత్త రికార్డులు సాధిస్తాయని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. మార్కెట్ బలోపేతం కోసం తమ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల గురించి ఇన్వెస్టర్లకు అవగాహన ఉందన్నారు. ‘పదేళ్లలో డీమ్యాట్ అకౌంట్ల సంఖ్య 2.3 కోట్ల నుంచి 15 కోట్లకు పెరిగింది. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ల సంఖ్య కోటి నుంచి 4.5కోట్లకు చేరింది. భారత ఆర్థిక వ్యవస్థపై ప్రజల నమ్మకానికి ఇది నిదర్శనం’ అని తెలిపారు.
Similar News
News December 1, 2025
WNP: పోలీసుల కర్తవ్యం నిబద్ధత ప్రశంసనీయమైనది: ఎస్పీ

శాంతి భద్రతల పరిరక్షణలో ప్రతి పోలీసు అధికారి కర్తవ్య నిబద్ధత ప్రశంసనీయమైనదని వనపర్తి ఎస్పీ సునీత రెడ్డి అన్నారు. సోమవారం ఆత్మకూరులో సీఎం పర్యటన విజయవంతానికి కృషి చేసిన అధికారులకు సిబ్బందికి ఎస్పీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా, పూర్తి శాంతియుత వాతావరణంలో సీఎం పర్యటన జరిగిందని సహకరించిన పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
News December 1, 2025
CM చంద్రబాబుపై లిక్కర్ కేసు మూసివేత

AP: సీఎం చంద్రబాబుపై ఉన్న లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ హయాంలో నమోదైన ఈ కేసు దర్యాప్తును ముగిస్తూ సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. అవకతవకలు జరిగినట్లు ఆధారాలు లేవని పేర్కొంది. దాని ఆధారంగా ఏసీబీ కోర్టు కేసును మూసేసింది. అలాగే ఆయనపై ఉన్న ఫైబర్నెట్ కేసును క్లోజ్ చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
News December 1, 2025
₹50వేల కోట్ల దావా.. AERA పక్షాన కేంద్రం!

ఢిల్లీ, ముంబై విమానాశ్రయాల ప్రైవేట్ ఆపరేటర్లు, ఎయిర్పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ (AERA) ఆఫ్ ఇండియా మధ్య ₹50వేల కోట్ల దావా SCకు చేరింది. ఇందులో కేంద్రం AERA పక్షాన నిలిచింది. రెగ్యులేటెడ్ సర్వీసెస్ కోసం కాలిక్యులేట్ చేసే అసెట్స్ క్యాపిటల్ వ్యాల్యూపై విభేదాలున్నాయి. ఆపరేటర్లు గెలిస్తే ఢిల్లీ ఎయిర్పోర్టులో యూజర్ డెవలప్మెంట్ ఫీజు ₹129 నుంచి ₹1261కి, ముంబైలో ₹175 నుంచి ₹3,856కు పెరుగుతుంది.


