News March 17, 2024

కడప జిల్లాలో వారిద్దరూ 9వ సారి పోటీ

image

కడప జిల్లాలో ఇద్దరు సీనియర్ నాయకులపై అందరి దృష్టి ఉంది. కారణం వారు 9వ సారి ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నారు. వారే శెట్టిపల్లె రఘురామిరెడ్డి, నంద్యాల వరదరాజులరెడ్డి. ఇద్దరికీ 40 ఏళ్ల పై చిలుకు రాజకీయ అనుభవం ఉంది. వరద 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, 3 సార్లు ఓడారు. రఘురామిరెడ్డి 4 సార్లు గెలిచి, 4 ఓడారు. ఇప్పడు వీరిద్దరు 9వ సారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మరోసారి వీరు గెలిచి చరిత్ర సృష్టిస్తారా?

Similar News

News November 26, 2025

పులివెందులలో జగన్.. విద్యార్థులతో సెల్ఫీ

image

కడప జిల్లా పర్యటనలో ఉన్న మాజీ సీఎం జగన్ ఇవాళ తన సొంత నియోజకవర్గంలో రైతులను పరామర్శించడానికి వెళ్లిన విషయం తెలిసిందే. జగన్‌ దారి మధ్యలో వెళ్తూ ప్రజలతో మమేకమై మాట్లాడుకుంటూ వెళ్లారు. అందులో ఆయనను కలవడానికి స్థానికంగా పిల్లలు వచ్చారు. వారితో ఆయన ఆప్యాయంగా మాట్లాడుతూ.. సెల్పీ తీసుకున్నారు. బాగా చదువుకోవాలని ఆకాంక్షించారు.

నిరూపించండి.. రాజీనామా చేస్తా: MLC భూమిరెడ్డి

image

మాజీ సీఎం వైఎస్ జగన్‌కు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. బుధవారం అమరావతిలో ఆయన మాట్లాడారు. గత ఐదేళ్లలో రాయలసీమకు అదనంగా ఒక్క ఎకరాకు నీరు ఇచ్చారా?, అరటి పంటకు బీమా ఎక్కడ చెల్లించాలో చెప్పాలని ప్రశ్నించారు. బీమా చెల్లించినట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని జగన్‌కు ఆయన సవాల్ విసిరారు. జగన్ వల్లే పులివెందులలో బనానా ప్రాసెసింగ్ యూనిట్ మనుగడలోకి రాలేదన్నారు.