News October 10, 2024
వారిద్దరూ ఛాన్సులు వేస్ట్ చేసుకుంటున్నారు: ఆకాశ్ చోప్రా

బంగ్లాతో టీ20 సిరీస్లో భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ, శాంసన్ అవకాశాల్ని వృథా చేసుకుంటున్నారని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డారు. భారత జట్టులో ఓపెనర్లకు చాలా పోటీ ఉందని గుర్తు చేశారు. ‘వారికి విలువైన 2 ఛాన్సులు అయిపోయాయి. తమ వికెట్ను పారేసుకోకుండా భారీ స్కోరు చేసేందుకు చూడాలి. సౌతాఫ్రికా టూర్కి జైస్వాల్, గిల్, రుతురాజ్ రెడీగా ఉంటారు. ఇషాన్ కిషాన్ కూడా రేసులోకి రావొచ్చు’ అని అంచనా వేశారు.
Similar News
News November 25, 2025
భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ

ఓరుగల్లు ప్రజల ఇలవేల్పు భద్రకాళి అమ్మవారికి అర్చకులు మంగళవారం ప్రత్యేకంగా అలంకరించారు. మార్గశిర మాసం, మొదటి మంగళవారం, పంచమి తిథి సందర్బంగా తెల్లవారుజామునే ఆలయాన్ని తెరిచి, అమ్మవారికి అభిషేకం నిర్వహించి పూజా కార్యక్రమాలు చేపట్టారు. చుట్టుపక్క ప్రాంతాల మహిళలు, భక్తులు సైతం ఉదయాన్నే ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని, తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు.
News November 25, 2025
కుర్రాళ్ల ఓపికకు ‘టెస్ట్’!

సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్లో మన కుర్రాళ్లు తేలిపోతున్నారు. ఒకప్పుడు సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రవిడ్ రోజుల తరబడి క్రీజులో నిలబడేవారు. బౌలర్ల సహనాన్ని పరీక్షించేవారు. కానీ ఇప్పుడున్న ప్లేయర్లు పరుగులు చేయడం అటుంచితే కనీసం గంట సేపైనా ఓపికతో మైదానంలో ఉండలేకపోతున్నారు. కోహ్లీ, రోహిత్, పుజారా, రహానేల తర్వాత టెస్టుల్లోకి వచ్చిన పంత్, నితీశ్, సుదర్శన్, జురెల్ దారుణంగా విఫలమవుతున్నారు.
News November 25, 2025
భార్య గర్భంతో ఉంటే.. భర్త ఇవి చేయకూడదట

భార్య గర్భంతో ఉన్నప్పుడు భర్త కొన్ని పనులు చేయకపోవడం ఉత్తమమని పండితులు చెబుతున్నారు. ‘చెట్లు నరకడం, సముద్ర స్నానం చేయడం శ్రేయస్కరం కాదు. అలాగే క్షౌరం కూడా చేయించుకోకూడదు. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు చావు ఇంటికి వెళ్లడం మంచిది కాదు. శవాన్ని మోయడం అశుభంగా భావిస్తారు. గృహ ప్రవేశం, వాస్తు కర్మలు వంటివి కూడా చేయకూడదు. ఈ నియమాలు పాటిస్తే దీర్ఘాయువు గల బిడ్డ జన్మిస్తుంది’ అని సూచిస్తున్నారు.


