News July 29, 2024
వాళ్లిద్దరూ విరాట్ స్థానాన్ని భర్తీ చేయగలరు: ఉతప్ప

అంతర్జాతీయ టీ20ల నుంచి విరాట్ కోహ్లీ రిటైరైన సంగతి తెలిసిందే. అతడి లోటును గిల్, రుతురాజ్ భర్తీ చేయగలరని మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప అభిప్రాయపడ్డారు. ‘వారిద్దరూ అద్భుతమైన ఆటగాళ్లు. ఒకరినే ఎంచుకోమంటే కష్టం. రుతురాజ్ స్థిరంగా రాణిస్తుంటే, గిల్ క్లాస్‌తో మైమరపిస్తున్నారు. వాళ్ల ఘనతలు, రికార్డులు చూస్తేనే ఆ విషయం అర్థమవుతుంది. భారత జట్టులో ఇద్దరూ ఉంటే బాగుంటుంది’ అని పేర్కొన్నారు.
Similar News
News December 11, 2025
హోరాహోరీ.. 3 ఓట్లతో విజయం

TG: సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోటీ కొనసాగుతోంది. కొందరు స్వల్ప ఓట్ల తేడాతోనే విజయం సొంతం చేసుకుంటున్నారు. రంగారెడ్డి(D) ఫరూక్నగర్ మండలం శేరిగూడలో కొండం శారద శంకర్‌గౌడ్ 3 ఓట్లతో గెలుపొందారు. అటు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం గుమ్లాపూర్‌లో అన్నాచెల్లెళ్లు బరిలో నిలవగా చెల్లెలు స్రవంతి ఘన విజయం సాధించారు.
News December 11, 2025
కిచెన్ పరికరాలతో సిద్ధంగా ఉండండి: మమత

SIR పేరుతో ఓట్లు తొలగిస్తే కనుక అడ్డుకోవడానికి కిచెన్ పరికరాలతో సిద్ధంగా ఉండాలని WB CM మమత మహిళలకు పిలుపునిచ్చారు. వారితో పాటే పురుషులూ పోరాడాలన్నారు. ‘మీరు దాడి చేస్తే ఎలా అడ్డుకోవాలో తెలుసు. BIHAR చేయలేకపోయింది. మేము చేసి చూపిస్తాం’ అని BJPని హెచ్చరించారు. ఆ పార్టీ IT సెల్ రూపొందించిన జాబితాతో ఎన్నిక జరపాలని చూస్తోందన్నారు. WB నుంచి ప్రజలను వెళ్లగొట్టేందుకు ఎవరినీ అనుమతించబోమని స్పష్టం చేశారు.
News December 11, 2025
6 దేశాల్లో ధురంధర్ బ్యాన్.. ఎందుకంటే?

రణ్వీర్ సింగ్ ‘ధురంధర్’ చిత్రం ఈ వారంలో రూ.200 కోట్ల క్లబ్లో చేరే అవకాశముందని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ చిత్రానికి గల్ఫ్ దేశాల్లో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశాల్లో మూవీ రిలీజ్ కోసం టీమ్ ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. బహ్రెయిన్, కువైట్, ఒమన్, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతర్ దేశాల్లో రిలీజ్ చేయలేదు. ‘యాంటీ పాకిస్థాన్ కంటెంట్’ అన్న కారణంతోనే ఆ దేశాలు మూవీని బ్యాన్ చేశాయి.


