News May 20, 2024

వారిద్దరికీ పాకిస్థాన్‌లోనే మద్దతు ఎక్కువ: అమిత్ షా

image

విపక్ష నేతలు కేజ్రీవాల్, రాహుల్ గాంధీకి భారత్‌లో కన్నా పాకిస్థాన్‌లోనే మద్దతు దారులు ఎక్కువని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. ఢిల్లీలో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడే కేజ్రీవాల్ అవినీతి కేసులోనే అరెస్టయ్యారని విమర్శించారు. జైలుకు వెళ్లినప్పటికీ సీఎం పదవిని వీడని సిగ్గులేని వ్యక్తి కేజ్రీవాల్ అని దుయ్యబట్టారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కనిపించకుండా పోతుందని అన్నారు.

Similar News

News September 19, 2025

మైథాలజీ క్విజ్ – 10

image

1. శ్రీరాముడి పాదధూళితో శాపవిముక్తురాలైంది ఎవరు?
2. కురుక్షేత్ర యుద్ధంలో శకునిని ఎవరు చంపారు?
3. కృష్ణద్వైపాయనుడు అంటే ఎవరు?
4. మధుర మీనాక్షి దేవాలయం ఏ నది ఒడ్డున ఉంది?
5. చిరంజీవులు ఎంత మంది?
– సమాధానాలు సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం. <<-se>>#mythologyquiz<<>>

News September 19, 2025

సూర్యపై ఫిర్యాదు చేయనున్న PCB?

image

పాకిస్థాన్‌పై గెలుపును భారత ఆర్మీకి అంకితం చేస్తున్నట్లు ప్రకటించిన <<17712252>>సూర్యకుమార్<<>> యాదవ్‌పై పాక్ క్రికెట్ బోర్డు ఐసీసీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆటల్లో సూర్య పొలిటికల్ కామెంట్స్ చేశారని, అది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని PCB భావిస్తున్నట్లు సమాచారం. కాగా ఇప్పటికే హ్యాండ్ షేక్ వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు సూర్యపై ఫిర్యాదు చేస్తే ఆదివారం భారత్vsపాక్ మ్యాచ్ మరింత హీటెక్కనుంది.

News September 19, 2025

MANUUలో టీచింగ్ పోస్టులు

image

మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (<>MANUU<<>>) 13 టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఈ నెల 29వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి పీజీ, పీహెచ్‌డీ, ఎంఈడీ/ఎంఏ ఎడ్యుకేషన్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 65ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.500.