News April 6, 2024
వారిద్దరితో రాజీనామా చేయించాలి: KTR

TG: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని మాజీ మంత్రి KTR డిమాండ్ చేశారు. వారిని అనర్హులుగా ప్రకటించాలన్నారు. కాంగ్రెస్ లోక్సభ మేనిఫెస్టోలో MP లేదా MLA పార్టీ మారితే అనర్హత వేసేలా 10వ షెడ్యూల్ సవరణ ప్రస్తావనను ఆయన స్వాగతించారు. అయితే కాంగ్రెస్ ఎప్పటిలానే చెప్పేది ఒకటి.. చేసేది మరొకటని దుయ్యబట్టారు. ఇతర పార్టీల నేతల్ని చేర్చుకోవడం ఆ పార్టీనే ప్రారంభించిందన్నారు.
Similar News
News December 29, 2025
పిశాచ స్థానం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారా?

ఇంటి ప్రధాన గోడకు, ప్రహరీ గోడకు మధ్య ఉండే ఖాళీ స్థలాన్ని ‘పిశాచ స్థానం’ అంటారు. ఈ స్థలం విషయంలో వాస్తు నియమాలు పాటించకపోతే ప్రతికూల ప్రభావాలు ఉంటాయని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు హెచ్చరిస్తున్నారు. ‘ప్రకృతి వనరుల సమతుల్యత దెబ్బతినడం వల్ల ఆర్థిక ఇబ్బందులు, వృత్తిలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలుంటాయి. ఇంటి నిర్మాణంలో ఈ ఖాళీ స్థలాన్ని నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>
News December 29, 2025
ఇసుక సముద్రంలో ఒంటరిగా!

నైజర్ దేశంలోని సహారా ఎడారిలో 400KMS పరిధిలో ఒకే ఒక్క చెట్టు ఉండేది. ఎడారిలో ప్రయాణించేవారికి ఈ ‘టెనెరే వృక్షం’ ఓ దిక్సూచిలా ఉండేది. నీటికోసం భూగర్భంలోనికి తన వేళ్లను విస్తరించి ప్రాణాలు నిలుపుకుంది. ఈ చెట్టు స్థిరత్వానికి, పోరాట పటిమకు నిదర్శనంగా నిలిచింది. 1973లో ఓ ట్రక్కు డ్రైవర్ చెట్టును ఢీకొట్టడంతో 300 ఏళ్ల దాని ప్రస్థానం ముగిసింది. ప్రస్తుతం దీని అవశేషాలను నైజర్ జాతీయ మ్యూజియంలో భద్రపరిచారు.
News December 29, 2025
2025: అత్యధిక వసూళ్ల చిత్రంగా ‘ధురంధర్’

ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన భారతీయ చిత్రంగా రణ్వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ నిలిచింది. ఈ చిత్రం రూ.1034.8కోట్లు రాబట్టింది. IMDb ప్రకారం 2025లో బాక్సాఫీస్ను షేక్ చేసిన టాప్-10 మూవీస్ ఇవే.. ధురంధర్, కాంతార-2 (₹853.4Cr), ఛావా(₹808.7Cr), సైయారా(₹575.8Cr), కూలీ (₹516.7Cr), వార్-2 (₹360.7Cr), మహావతార్ నరసింహ (₹326.1Cr), లోక చాప్టర్-1 (₹302.1Cr), OG (₹298.1Cr), హౌజ్ఫుల్-5 (₹292.5కోట్లు)


