News April 4, 2025

ST సర్టిఫికెట్ జారీకి పేరెంట్స్ ఇద్దరూ ట్రైబల్స్ కానక్కర్లేదు: కలకత్తా HC

image

పేరెంట్స్‌లో ఒకరు ట్రైబల్ కాదనే కారణంతో పిల్లలకు ST సర్టిఫికెట్ నిరాకరించడం తగదని కలకత్తా హైకోర్టు పేర్కొంది. ఓ నీట్ అభ్యర్థి ST సర్టిఫికెట్ కోసం అప్లై చేశారు. తల్లి ట్రైబల్ కాగా తండ్రి ఫార్వర్డ్ కమ్యూనిటీ వ్యక్తని అధికారులు అర్జీని తిరస్కరించారు. దీనిపై అభ్యర్థి హైకోర్టును ఆశ్రయించారు. కేసు విచారణ సందర్భంగా కోర్టు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 24గంటల్లో సర్టిఫికెట్ జారీ చేయాలని ఆదేశించింది.

Similar News

News December 16, 2025

అమ్మాయిలకు మీసాలు.. కారణమిదే

image

కొంతమంది అమ్మాయిలకు అబ్బాయిల్లా మీసాలు, గడ్డాలు రావడంతో పాటు ముఖంపై ఎక్కువగా వెంట్రుకలు ఉంటాయి. ఈ సమస్యను హిర్సుటిజం(Hirsutism) అంటారు. ఈ సమస్య PCOD, థైరాయిడ్ ఉన్నవారిలో కనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. మహిళల్లో చాలా తక్కువ మోతాదులో ఉండే మేల్ హార్మోన్స్ పెరగడం, కొన్నిరకాల మందులు వాడటం వల్ల కూడా ముఖంపై వెంట్రుకలు వస్తాయి. సమస్యను గుర్తించగానే వైద్యులను సంప్రదించడం మంచిది. <<-se>>#WomenHealth<<>>

News December 16, 2025

IIIT వడోదరలో ఉద్యోగాలు

image

IIIT వడోదర 7 ట్రైనింగ్& ప్లేస్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు DEC 22 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి PG(మేనేజ్‌మెంట్/ ఇంజినీరింగ్/LAW), CA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష/స్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.56,100- రూ.1,77,500 చెల్లిస్తారు. వెబ్‌సైట్: iiitvadodara.ac.in

News December 16, 2025

టెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

TG: టెట్-2026 పరీక్షల షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. జనవరి 3 నుంచి 20 వరకు ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు జరుగుతాయి. 9 రోజుల్లో 15 సెషన్లలో ఎగ్జామ్స్ ఉంటాయి. రోజూ ఉదయం 9 నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం 2 నుంచి సా.4.30 వరకు పరీక్షలు నిర్వహిస్తారు.