News November 7, 2024
ఆ రెండు షేర్లు భారీగా పతనం

హిందాల్కో షేర్లు గురువారం ట్రేడింగ్ సెషన్లో 8.42% నష్టపోయాయి. యూఎస్‌కు చెందిన అనుబంధ సంస్థ Novelis Q2 లాభం 18 శాతం క్షీణించడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. అలాగే గత ఏడాది కాలంలో 165% రిటర్న్ ఇచ్చిన TRENT షేర్లు 6.12% నష్టపోయాయి. Q2 రిజల్ట్స్ 39% (YoY) మేర పెరిగినా ఇన్వెస్టర్లను మెప్పించలేకపోయాయి. అలాగే ఇతరత్రా లాభాలు తగ్గడం కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.
Similar News
News January 20, 2026
ఆసిన్ వెడ్డింగ్ యానివర్సరీ.. భర్త క్రేజీ విషెస్!

హీరోయిన్ ఆసిన్, మైక్రోమ్యాక్స్ కోఫౌండర్ రాహుల్ శర్మ తమ పదో వెడ్డింగ్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆసిన్‌తో ఉన్న వెడ్డింగ్ పిక్ షేర్ చేస్తూ ‘ఆసిన్ నా జీవితంలో ప్రతి ముఖ్యమైన విషయంలో కో-ఫౌండర్. ఆమె లైఫ్‌లో నేను కో-స్టార్‌గా ఉండటం నా అదృష్టం’ అని రాహుల్ అన్నారు. ‘మన ఇంటిని, నా మనసుని హై-గ్రోత్ స్టార్టప్‌లా నడిపించు’ అంటూ ఆసిన్‌ను ఉద్దేశించి చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి.
News January 20, 2026
వంటింటి చిట్కాలు

* అల్లం, వెల్లుల్లి పేస్ట్ చేసే ముందు వాటిని వేయిస్తే పేస్ట్ ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.
* తేనెలో నాలుగైదు మిరియాలు వేస్తే చీమలు పట్టకుండా ఉంటాయి.
* చికెన్ ఉడికించేటప్పుడు ఒక కోడి గుడ్డు చేర్చడం వల్ల రుచి పెరుగుతుంది.
* కూర అడుగంటి మాడు వాసన వస్తే వాటిలో నిమ్మ, వెనిగర్, టమాటో రసం, వెన్న, పెరుగు కలిపితే వాసన పోయి, రుచి వస్తుంది.
News January 20, 2026
తమిళనాడు గవర్నర్ ‘హ్యాట్రిక్’ వాకౌట్!

తమిళనాడు అసెంబ్లీలో గవర్నర్ వర్సెస్ సర్కార్ వార్ మరోసారి బయటపడింది. ఈ ఏడాది తొలి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గవర్నర్ RN రవి సభ నుంచి వాకౌట్ చేశారు. తమిళ గీతం తర్వాత జాతీయ గీతాన్ని కూడా ప్లే చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దీనికి స్పీకర్ అప్పావు నిరాకరించడంతో గవర్నర్ తన ప్రసంగాన్ని చదవకుండానే బయటకు వెళ్లిపోయారు. ఇలా జరగడం ఇది వరుసగా మూడోసారి. 2024, 2025లో కూడా ఆయన ఇదే కారణంతో సభను బహిష్కరించారు.


