News September 14, 2024
ట్రంప్, కమల ఇద్దరూ చెడ్డవాళ్లే: పోప్

అమెరికా అధ్యక్ష అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్‌పై పోప్ ఫ్రాన్సిస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇద్దరూ జీవనానికి వ్యతిరేకులేనని పేర్కొన్నారు. ‘ట్రంప్ వలసలకు వ్యతిరేకి. కమల అబార్షన్‌కు మద్దతునిస్తున్నారు. నేను అమెరికన్ కాదు. నాకు అక్కడ ఓటు లేదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం. వారిద్దరూ చేసేది పాపమే. అమెరికన్లు ఆ ఇద్దరిలో తక్కువ చెడ్డ వ్యక్తిని ఎంచుకోవాల్సి ఉంటుంది’ అని వ్యాఖ్యానించారు.
Similar News
News January 22, 2026
వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్!

బ్యాంకులకు వరుసగా 4 రోజులు సెలవులు ఉండనున్నాయి. జనవరి 24 (నాలుగో శనివారం), 25 (ఆదివారం), 26 (గణతంత్ర దినోత్సవం) సెలవులు కాగా 27(మంగళవారం)న సమ్మె జరగనుంది. వారానికి ఐదు పని దినాలు ఉండాలని డిమాండ్ చేస్తూ బ్యాంక్ ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారు. అయితే ఈ రోజుల్లో డిజిటల్, ఏటీఎం సేవల్లో ఎలాంటి అంతరాయం ఉండదు. ఏమైనా బ్యాంక్ పనులుంటే ఇవాళ, రేపు ప్లాన్ చేసుకోవడం మేలు.
News January 22, 2026
సన్‌స్క్రీన్ ఎలా వాడాలంటే?

కాలంతో సంబంధం లేకుండా సన్‌స్క్రీన్ రోజూ వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్రాడ్-స్పెక్ట్రమ్ సన్‌స్క్రీన్‌ను ముఖం, మెడకు రాయాలి. బయటికి వెళ్లేందుకు 15నిమిషాల ముందు రాసుకోవాలి. తేమ ఎక్కువగా ఉన్నా, చెమట పట్టినప్పుడు, స్విమ్మింగ్ తర్వాత సన్‌స్క్రీన్ మళ్లీ రాసుకోవాలి. సున్నితమైన చర్మం ఉన్నవారు జింక్ ఆక్సైడ్ లేదా టైటానియం డయాక్సైడ్ ఉండే మినరల్-బేస్డ్ సన్స్క్రీన్లను వాడడం మంచిదని సూచిస్తున్నారు.
News January 22, 2026
రేపు వసంత పంచమి.. చిన్నారులతో ఇలా చేయిస్తున్నారా?

వసంత పంచమి నాడు పిల్లలకు తెలుపు/పసుపు దుస్తులు ధరింపజేసి ఓంకారంతో అక్షరాభ్యాసం చేయిస్తే సరస్వతీ దేవి కటాక్షంతో విద్యాబుద్ధులు సమకూరుతాయని పండితులు సూచిస్తున్నారు. ‘వారితో పలక, బలపం, పుస్తకాలకు పూజ చేయించాలి. తద్వారా ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. ‘‘సరస్వతీ నమస్తుభ్యం’’ పఠిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది’ అని చెబుతున్నారు. వసంత పంచమి పూజ, అక్షరాభ్యాస ముహూర్తం కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.


