News August 28, 2024
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా ఇద్దరి ప్రమాణం

AP: హైకోర్టు శాశ్వత <<13912324>>న్యాయమూర్తులుగా<<>> జస్టిస్ జ్యోతిర్మయి, జస్టిస్ గోపాలకృష్ణారావు ప్రమాణస్వీకారం చేశారు. హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్సింగ్ వారితో ప్రమాణం చేయించారు. అదనపు జడ్జిలుగా ఉన్న వీరిని శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని ఈ నెల 13న సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇటీవల ఆమోదం తెలిపారు.
Similar News
News December 1, 2025
ఈ దివ్య మంగళ రూపాన్ని దర్శించుకుంటే?

స్వయంభూః శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః|
అనాదినిధనో ధాతా విధాతా ధాతు రుత్తమః||
తనంతట తాను అవతరించిన శాంతి స్వరూపుడు, సూర్యుడికి జన్మనిచ్చిన కలువ పూల కన్నులు కలవాడు విష్ణుమూర్తి. ఈ సృష్టి మొత్తాన్ని సృష్టించి, నిర్మించి, పాలించే ఆయనను పూజించడం కన్నా మోక్ష మార్గం మరొకటి లేదు. అందుకే ఆ దివ్య మంగళ రూపాన్ని ధ్యానించాలి. అప్పుడే మనస్సుకు శాంతి లభిస్తుంది. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>

ప్రోటీన్ సప్లిమెంట్లు తీసుకుంటున్నారా?

ప్రోటీన్ పౌడర్లను సాధారణంగా గుడ్లు, పాలు, సోయా, బఠానీలు లేదా బియ్యం వంటి మొక్కల మూలాలతో తయారు చేస్తారు. కొన్నిసార్లు వీటి మూలాల మిశ్రమంతో తయారు చేస్తారు. చక్కెరతో కూడిన ఈ సప్లిమెంట్లు సమతుల్య ఆహారం ఉద్దేశ్యాన్ని విరుద్ధంగా ఉండడమే కాకుండా, మూత్రపిండాలు, ఎముకల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వైద్యుల సలహా లేకుండా వీటిని వాడకూడదని సూచిస్తున్నారు.