News June 4, 2024

చీపురుపల్లిలో బొత్స ఆధిక్యం

image

AP:చీపురుపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. టీడీపీ అభ్యర్థి కళా వెంకట్రావుపై బొత్స లీడింగ్‌లో ఉన్నారు. అటు గజపతినగరంలో టీడీపీ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ 1300 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడ వైసీపీ తరఫున బొత్స అప్పల నర్సయ్య బరిలో నిలిచారు.

Similar News

News November 18, 2025

కోర్టులు, విద్యాసంస్థలకు బాంబు బెదిరింపులు

image

ఢిల్లీలో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. పటియాలా హౌస్, సాకేత్, రోహిణి కోర్టులతోపాటు పలు స్కూళ్లు, కాలేజీల్లో బాంబులు పెట్టినట్లు దుండగులు మెయిల్స్ చేశారు. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఆయా ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్స్‌తో తనిఖీలు చేస్తున్నాయి. ముందుజాగ్రత్తగా కోర్టులు, విద్యాసంస్థల్లో సిబ్బందిని, విద్యార్థులను బయటకు పంపించాయి. కాగా ఇటీవల ఎర్రకోట దగ్గర ఆత్మాహుతి దాడి జరిగిన విషయం తెలిసిందే.

బంధాలు చెడిపోగానే రేప్ కేసులు పెడుతున్నారు: మద్రాస్ హైకోర్టు

image

విఫలమైన ప్రతి బంధాన్ని నేరంగా పరిగణించలేమని మద్రాస్ హైకోర్టు (మదురై బెంచ్) వ్యాఖ్యానించింది. బంధాలు చెడిపోగానే రేప్ కేసులు పెట్టడం సరికాదంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి దేవా విజయ్(తిరునెల్వేలి) తనతో 9ఏళ్లు లైంగిక సంబంధంలో ఉన్నాడని, మోసం చేశాడని ఓ యువతి రేప్ కేసు పెట్టింది. దీనిపై విజయ్ కోర్టును ఆశ్రయించాడు. విచారించిన కోర్టు యువతిని మోసం చేశాడనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని కేసును కొట్టివేసింది.