News October 11, 2025
బొత్సకు వైసీపీ నుంచే ప్రాణహాని: పల్లా

AP: వైసీపీ ఎమ్మెల్సీ <<17973709>>బొత్స<<>> సత్యనారాయణకు కూటమి నుంచి ఎలాంటి ప్రాణహాని లేదని TDP చీఫ్ పల్లా శ్రీనివాస్ అన్నారు. ఆయనకు సొంత పార్టీ నుంచే ప్రాణహాని ఉండొచ్చని కౌంటర్ ఇచ్చారు. ఈ విషయాన్ని బొత్స చెప్పుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. మండలిలో బొత్స కొంత రాణించే ప్రయత్నం చేస్తున్నారని, అందుకే జగన్ నుంచి ప్రాణహాని ఉండొచ్చని పేర్కొన్నారు. బొత్స భద్రత కావాలని కోరితే CM నిర్ణయం తీసుకుంటారన్నారు.
Similar News
News October 12, 2025
రాహుల్ మాదిరే తేజస్వీ ఓడిపోతారు: PK

అమేఠిలో గతంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓడినట్లే RJD నేత తేజస్వీ యాదవ్ రాఘోపుర్‌లో పరాజయం చెందుతారని జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ జోస్యం చెప్పారు. ఆ నియోజకవర్గంలో కుటుంబ ఆధిపత్యాన్ని ఓటర్లు ఒప్పుకోవట్లేదని విమర్శించారు. తేజస్వీ కుటుంబం ఇక్కడి నుంచి ఎన్నికవుతున్నా కనీస సౌకర్యాలు కరవయ్యాయని ఆరోపించారు. అటు ఎన్నికల్లో తన పోటీపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని వివరించారు.
News October 12, 2025
కాలుష్య నియంత్రణ చర్యలు దేశానికి మోడల్ కావాలి: పవన్

AP: పకడ్బందీ ప్రణాళికతో కాకినాడ(D) తీర ప్రాంత కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలని Dy.CM పవన్ అధికారులను ఆదేశించారు. ‘ఉప్పాడ తీర ప్రాంతంలో పరిస్థితులపై అధ్యయనం చేయండి. 100రోజుల ప్రణాళికతో జాలర్ల సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషించండి. మనం తీసుకోబోయే కాలుష్య నియంత్రణ చర్యలు దేశానికి మోడల్ కావాలి. వ్యర్థాలను శుద్ధి ప్రక్రియలో అధునాతన సాంకేతికతను పరిశ్రమలు వినియోగించాలి’ అని తెలిపారు.
News October 12, 2025
డ్రోన్ దాడుల్లో 60 మంది మృతి!

ఆఫ్రికా దేశం సూడాన్‌లో పారామిలిటరీ ర్యాపిడ్ ఫోర్సెస్ రెచ్చిపోయాయి. నార్త్ డార్ఫర్ సిటీలోని షెల్టర్‌పై జరిపిన డ్రోన్ దాడుల్లో 60 మంది వరకు మరణించారు. వీరిలో చిన్నారులు, మహిళలే సగానికి పైగా ఉన్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. 2023 నుంచి ఆర్మీతో పారామిలిటరీ ఘర్షణలు కొనసాగిస్తోంది. ఇందులో వేల సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.