News March 27, 2024
కొత్త రూల్‌తో బౌలర్లదే పైచేయి: CSK ప్లేయర్

ఐపీఎల్‌లో ఓవర్‌లో రెండు బౌన్సర్లు వేసేందుకు అవకాశం కల్పించడంపై సీఎస్కే బౌలర్ దీపక్ చాహర్ స్పందించారు. ఈ రూల్‌తో బ్యాటర్లపై బౌలర్లు పైచేయి సాధించేందుకు అవకాశం ఉందన్నారు. ఓవర్‌లో రెండు బౌన్సర్లు వేసే వెసులుబాటు పేసర్లకు ఉపయోగకరమని చెప్పారు. తనకు కెప్టెన్ రుతురాజ్‌తో పాటు మహీ భాయ్ సూచనలు కీలకమని పేర్కొన్నారు.
Similar News
News April 2, 2026
ట్రంప్ ప్రకటన.. భారీగా పెరిగిన క్రూడాయిల్ ధర

ఇరాన్ యుద్ధంపై ట్రంప్ <<19543167>>ప్రకటన<<>> నేపథ్యంలో క్రూడాయిల్ ధర భగ్గుమంది. బ్రెంట్ క్రూడ్ ధర 4 శాతం పెరిగి 105 డాలర్లకు చేరింది. అలాగే WTI బ్యారెల్ చమురు రేట్ 3 శాతం ఎగసి 103 డాలర్లుగా ఉంది. ఇక ట్రంప్ ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లోకి వెళ్లాయి. ఈ ప్రభావంతో భారత మార్కెట్లు కూడా నష్టపోయే ఛాన్స్ ఉంది. అటు బంగారం, వెండి ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది.
News April 2, 2026
నాగ్.. 25 నుంచి 60ఏళ్ల వరకు!

తన 100వ సినిమాపై నటుడు నాగార్జున ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ మూవీలో తాను 25 నుంచి 60ఏళ్ల వయస్సు వరకు పలు గెటప్స్‌లో కనిపించనున్నట్లు తెలిపారు. యువకుడిగా కనిపించడానికి డీ-ఏజింగ్ టెక్నిక్ వాడుతున్నామన్నారు. తండ్రి-కూతుళ్ల మధ్య ఉండే సెంటిమెంట్ చుట్టూ కథ ఉంటుందని వెల్లడించారు. తమిళ డైరెక్టర్ RA కార్తీక్ తెరకెక్కిస్తున్న ఈ మూవీకి కింగ్ 100, లాటరీ కింగ్ తదితర పేర్లు పరిశీలిస్తున్నారు.
News April 2, 2026
ఇటలీకి హ్యాట్రిక్ షాక్!

ఫుట్‌బాల్ ప్రపంచకప్ హిస్టరీలో నాలుగుసార్లు (1932, 1938, 1982, 2006) ఛాంపియన్‌గా నిలిచిన ఇటలీ ఇప్పుడు క్వాలిఫికేషన్‌కే తడబడుతోంది. 2018, 2022తో పాటు ఇప్పుడు లేటెస్ట్‌గా మరోసారి ఆ జట్టు అర్హతను సాధించలేకపోయింది. ప్రత్యర్థి బోస్నియాను తక్కువ అంచనా వేసిందనే విమర్శలు ఎదుర్కొంటోంది. ఇక ఇతర స్టార్ జట్లు చిలీ, పోలాండ్, నైజీరియా, కోస్టారికా కూడా అర్హత సాధించలేకపోయాయి. JUN 11 నుంచి WC ప్రారంభంకానుంది.


