News February 7, 2025
భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు
అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్లలో అనిల్ కుంబ్లే (956) తొలి స్థానంలో ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా రవిచంద్రన్ అశ్విన్(765), హర్భజన్ సింగ్ (711), కపిల్ దేవ్ (687), జహీర్ ఖాన్ (610), రవీంద్ర జడేజా (600), జవగళ్ శ్రీనాథ్ (551), మహ్మద్ షమీ (452) ఉన్నారు. ఇవాళ్టి మ్యాచులో జడేజా 600 వికెట్ల ఘనతను అందుకున్న సంగతి తెలిసిందే. వీరిలో మీ ఫేవరెట్?
Similar News
News February 7, 2025
సుమతీ నీతి పద్యం- తాత్పర్యం
ఏఱకుమీ కసుగాయలు
దూఱకుమీ బంధుజనుల దోషము సుమ్మీ
పాఱకుమీ రణమందున
మీఱకుమీ గురువులాజ్ఞ మేదిని సుమతీ!
తాత్పర్యం: నేలమీద పచ్చికాయలను ఏరుకుని తినవద్దు. బంధువులను, ప్రజలను దూషించవద్దు. యుద్ధము నుంచి వెనుతిరిగి పారిపోరాదు. పెద్దల ఆజ్ఞను అతిక్రమించరాదు.
News February 7, 2025
అవినీతి బ్రహ్మరాక్షసి లాంటిది: జస్టిస్ ఎన్వీ రమణ
నిజాయితీ కూడిన మేధావులు దేశానికి కావాలని మాజీ CJI జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. ప్రస్తుతం వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులుగా మారి వారితో అవినీతి చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. HYDలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అవినీతి బ్రహ్మ రాక్షసి లాంటిదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల వల్ల ప్రజలు వ్యవస్థల మీద నమ్మకం కోల్పోతున్నారన్నారు. పిల్లలకూ రాజకీయాలపై అవగాహన కల్పించాలని సూచించారు.
News February 7, 2025
కులగణనపై సభకు రాహుల్ను ఆహ్వానించాం: భట్టి
తెలంగాణలో అమలవుతున్న పథకాలను కాంగ్రెస్ అధిష్ఠానానికి వివరించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో ఢిల్లీలో భేటీ ముగిసిన అనంతరం ఆయన మాట్లాడారు. కులగణన వివరాలను కేసీకి అందించామన్నారు. కులగణన, ఎస్సీ వర్గీకరణపై త్వరలో బహిరంగ సభలు నిర్వహిస్తున్నామని, వీటికి రాహుల్ గాంధీని ఆహ్వానించామని చెప్పారు.