News December 26, 2024
బాక్సింగ్ డే: ముగ్గురు బ్యాటర్లు అర్ధసెంచరీలు

టీమ్ ఇండియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా ప్లేయర్లు అదరగొడుతున్నారు. ఓపెనర్లు కోన్ట్సస్(60), ఖవాజా(57) అర్ధసెంచరీలతో రాణించారు. టీ విరామం తర్వాత లబుషేన్(61*) కూడా అర్ధసెంచరీ పూర్తి చేశారు. మరో బ్యాటర్ స్మిత్(30*) క్రీజులో ఉన్నారు. బుమ్రా, జడేజా చెరో వికెట్ తీశారు.
Similar News
News December 29, 2025
తిరుమల దర్శనాలు.. అధికారులకు సవాలే..!

గతేడాది వైకుంఠ ఏకాదశి సందర్భంగా తొక్కిసలాట జరిగి పలువురు చనిపోయారు. దీంతో టీటీడీ, పోలీసులు ఈసారి పటిష్ఠ చర్యలు చేపట్టారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు ప్రశాంతంగా వైకుంఠ ద్వార దర్శనాలు పూర్తి చేయించడం అధికారులకు సవాల్‌గా మారింది. చిన్నపాటి గొడవ కూడా లేకుండా విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు గట్టిగా ప్రయ్నతిస్తున్నాయి.
News December 29, 2025
అమరావతిలో హైస్పీడ్, ట్రాఫిక్ ఫ్రీ రోడ్లు

AP: రాజధాని అమరావతిలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని.. ట్రాఫిక్ జామ్‌కు తావులేకుండా విశాలమైన రహదారుల నిర్మాణం ఊపందుకుంది. 50-60 మీటర్ల వెడల్పుతో హైస్పీడ్ రోడ్లను నిర్మిస్తున్నారు. E11, E13, E15 రహదారులను NH-16తో అనుసంధానం చేస్తున్నారు. 9 వరుసల సీడ్ యాక్సెస్ రోడ్డు(E-3) ద్వారా అమరావతికి సులభంగా చేరుకోవచ్చు. రోడ్ల కింద డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్ లైన్లు వంటి సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు.
News December 29, 2025
రికార్డు సృష్టించిన కోనేరు హంపి

ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో మహిళల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నారు. దీంతో కలిపి మొత్తం 5 వరల్డ్ ర్యాపిడ్ ఛాంపియన్షిప్ మెడల్స్ గెలిచిన మొదటి మహిళగా హంపి రికార్డు సృష్టించారు. 15 ఏళ్ల వయసులోనే చదరంగంలో గ్రాండ్ మాస్టర్ అయిన హంపి.. గత రెండు దశాబ్దాల్లో ఎన్నో ఘనతలు సాధించారు.


