News August 9, 2025
ఆ వెబ్ సిరీస్ చూసి బాలుడి సూసైడ్

బెంగళూరులో ఓ బాలుడు (14) వెబ్ సిరీస్ చూసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చెన్నమ్మకెరే అచ్చకట్టు పీఎస్ పరిధిలో నివసించే గాంధార్ ఇటీవల జపనీస్ వెబ్ సిరీస్ ‘డెత్ నోట్’ చూస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో గదిలోకి వెళ్లి ఓ లేఖ రాసి ఉరేసుకుని చనిపోయాడు. ‘నేను వెళ్లే సమయం ఆసన్నమైంది. మీరు ఈ లేఖ చదివే సమయానికి స్వర్గంలో ఉంటా’ అని రాశాడు. సిరీస్‌లోని ఓ క్యారెక్టర్ బొమ్మను కూడా తన గదిలో గీశాడు.
Similar News
News August 9, 2025
ఎల్లుండి ‘మాస్ జాతర’ టీజర్

మాస్ మహారాజా రవితేజ హీరోగా భాను భోగవరపు తెరకెక్కించిన ‘మాస్ జాతర’ మూవీ నుంచి కొత్త అప్‌డేట్ వచ్చింది. ఆగస్టు 11న ఉదయం 11.08 గంటలకు ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన రెండు పాటలు ఆకట్టుకుంటున్నాయి. నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం వినాయక చవితి కానుకగా ఈ నెల 27న రిలీజ్ కానుంది.
News August 9, 2025
OBCల క్రీమీలేయర్‌ను సవరించాలని ప్రతిపాదన

OBCల క్రీమీలేయర్ ఆదాయ పరిమితిని వెంటనే సవరించాలని పార్లమెంటరీ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ప్రస్తుతం ఉన్న రూ.8 లక్షల పరిమితిని పెంచాలని ప్రతిపాదించింది. ప్రస్తుత పరిమితి వల్ల చాలామంది రిజర్వేషన్లు, ప్రభుత్వం అందించే పథకాలను కోల్పోతున్నారంది. 2017లో వార్షిక పరిమితిని రూ.6.5 లక్షల నుంచి రూ.8 లక్షలకు సవరించారని, దీనిని ప్రతి మూడేళ్లకోసారి సవరించాల్సి ఉందని గుర్తు చేసింది.
News August 9, 2025
మహేశ్ బర్త్‌డే.. రాజమౌళి సినిమాపై బిగ్ అప్డేట్

మహేశ్‌తో తెరకెక్కిస్తున్న సినిమాపై డైరెక్టర్ రాజమౌళి కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం షూటింగ్ కొనసాగుతోందని చెప్పారు. 2025 నవంబర్‌లో మూవీకి సంబంధించి బిగ్ అప్డేట్ రివీల్ చేయనున్నట్లు తెలిపారు. ‘ఇది ఇంతకుముందు ఎన్నడూ చూడనటువంటిది’ అని ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. మెడలో నందీశ్వరుడితో కూడిన త్రిశూలం లాకెట్ ధరించిన మహేశ్ ఛాతీ పిక్ షేర్ చేశారు. తమ మూవీ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.