News July 17, 2024
కుక్కల దాడిలో బాలుడి మృతి.. సీఎం కీలక ఆదేశాలు
TG: కుక్కల దాడిలో బాలుడి <<13644434>>మృతి<<>> తనను కలచివేసిందని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించడానికి కాల్ సెంటర్/టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని సూచించారు. వీధి కుక్కల దాడులకు కారణాలను విశ్లేషించడానికి పశువైద్యులు, బ్లూక్రాస్ సంస్థల ప్రతినిధులతో కమిటీ వేయాలని సీఎం చెప్పారు.
Similar News
News January 22, 2025
భారత్ ఫోర్జ్ ప్రతినిధులతో లోకేశ్ భేటీ
AP: దావోస్ పర్యటనలో భాగంగా భారత్ ఫోర్జ్ సంస్థ వైస్ ఛైర్మన్ కళ్యాణితో మంత్రి లోకేశ్ భేటీ అయ్యారు. APలో రక్షణ పరికరాల తయారీ త్వరగా ప్రారంభించాలని కోరారు. R&D శిక్షణ కేంద్రం, రక్షణ పరికరాల తయారీ కోర్సులు, ITIలలో స్కిల్ డెవలప్మెంట్కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మడకశిర పరిధిలో రూ.2400 కోట్లతో రక్షణ పరికరాల యూనిట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు భారత్ ఫోర్జ్ ప్రతినిధులు లోకేశ్కు బదులిచ్చారు.
News January 22, 2025
రెండో రోజు ఐటీ రైడ్స్
హైదరాబాద్లోని చిత్ర నిర్మాణ సంస్థలపై రెండో రోజు ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. SVC నిర్మాణ సంస్థ యజమానులు దిల్ రాజు, శిరీష్, మైత్రీ మూవీ మేకర్స్ అధినేతల ఇళ్లు, కార్యాలయాల్లో అధికారులు విస్తృతంగా సోదాలు చేస్తున్నారు. ఇటీవల విడుదలైన పుష్ప-2, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల కలెక్షన్ల నేపథ్యంలో తనిఖీలు జరుగుతున్నాయి. ప్రకటించిన కలెక్షన్లకు కడుతున్న ఆదాయ పన్నుకు మధ్య తేడాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
News January 22, 2025
వైస్ ప్రెసిడెంట్గా ఉషను ఎంపిక చేయాల్సింది: ట్రంప్
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన సందర్భంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భార్య, భారత సంతతి మహిళ ఉషపై ప్రశంసలు కురిపించారు. ఆమె చాలా తెలివైందని, ఉపాధ్యక్ష పదవికి ఉషనే ఎంపిక చేయాల్సింది కానీ వారసత్వం సరికాదు కాబట్టి జేడీని తీసుకున్నా’ అని వ్యాఖ్యానించారు. ఇక జేడీ గొప్ప సెనెటర్ అని, అందుకే ఆయనకు ఓహియో బాధ్యతలు అప్పగించినట్లు ట్రంప్ తెలిపారు.