News April 16, 2024
‘అఖండ-2’పై బోయపాటి అప్డేట్

బాలకృష్ణ-బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘అఖండ’ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందన్న బోయపాటి లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు. ‘ప్రస్తుతం ఎన్నికల హడావిడి ఉంది. అది పూర్తయ్యాక ‘అఖండ-2’ ఉంటుంది. ఈ సీక్వెల్‌లో సమాజానికి కావాల్సిన ఓ మంచి విషయం ఉంటుంది’ అని బోయపాటి చెప్పారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తైనట్లు తెలిపారు.
Similar News
News April 3, 2026
హార్ముజ్ To ఇండియా.. షిప్‌కు ఎంత టైమ్ పడుతుంది?

ఇరాన్ తీరంలోని హార్ముజ్ జలసంధి నుంచి షిప్స్/ట్యాంకర్లు భారత పశ్చిమ తీరానికి చేరుకోవడానికి లోడు, రూట్‌ను బట్టి సాధారణంగా 2-3 రోజులు పడుతుంది. సుమారు 1000KM దూరంలోని కాండ్లా(GJ) పోర్టుకు 36-40 గంటల్లో నౌకలు చేరుకుంటాయి. ముంబై(MH)కి రావడానికి 50-55 గంటలు అవుతుంది. ఆయిల్ ట్యాంకర్లు సగటున గంటకు 24-37 KM వేగంతో ప్రయాణిస్తాయి. అమెరికాతో యుద్ధం నేపథ్యంలో హార్ముజ్‌ను ఇరాన్ మూసేయడం తెలిసిందే.
News April 3, 2026
BREAKING: పెరిగిన బంగారం ధర

నిన్న భారీగా తగ్గిన బంగారం ధర ఇవాళ పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,960 పెరిగి రూ. రూ.1,50,930కు చేరింది. 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,800 ఎగబాకి రూ.1,38,350 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ.2,55,000గా ఉంది.
News April 3, 2026
ECIL, హైదరాబాద్‌లో 32 ఉద్యోగాలు

కాంట్రాక్ట్ ప్రాతిపదికన 32 పోస్టుల భర్తీకి ECIL, హైదరాబాద్.. దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వీటిలో ప్రాజెక్ట్ ఇంజినీర్-14, టెక్నికల్ ఆఫీసర్-8, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్-3, సీనియర్ ఆర్టీజన్-7 ఉన్నాయి. సంబంధిత ట్రేడ్‌లో ITI/డిప్లొమా/BE/బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ అనుభవం ఉన్నవారు అప్లై చేయొచ్చు. వయసు 30-33 మధ్య ఉండాలి. APR- 9,18న ఇంటర్వ్యూ ఉంటుంది. పూర్తి వివరాలకు www.ecil.co.in చూడండి.


