News May 14, 2024

పలు గ్రామాల్లో పోలింగ్ బహిష్కరణ

image

TG: రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల నిన్న పోలింగ్‌ను ఓటర్లు బహిష్కరించారు. యాదాద్రి జిల్లా కనుముకుల గ్రామంలో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్న డిమాండ్‌తో, కడెం మండలం అల్లంపల్లిలో రోడ్డు గురించి, ఖమ్మం జిల్లా రాయమాదారం గ్రామస్థులు వంతెన గురించి, మైనింగ్ అనుమతులు రద్దు చేయాలన్న డిమాండ్‌తో బల్మూరు మండలం మైలారం గ్రామస్థులు ఓటింగ్‌ను బహిష్కరించారు. అధికారులు ప్రజలకు నచ్చజెప్పి ఓటింగ్ వేయించారు.

Similar News

News January 10, 2025

కలెక్టర్లతో సీఎం రేవంత్ సమావేశం

image

TG: కలెక్టర్లతో సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. రైతుభరోసా, రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకాలపై కలెక్టర్లకు ఆయన దిశానిర్దేశం చేస్తున్నారు. కొత్త పథకాల విధివిధానాల ఖరారుపైనా చర్చిస్తున్నారు.

News January 10, 2025

‘గేమ్ ఛేంజర్’ వచ్చేది ఈ OTTలోనే!

image

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా ఈరోజు థియేటర్లలో రిలీజవగా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. దాదాపు రూ.450+ కోట్లతో రూపొందిన ఈ చిత్ర OTT హక్కులను ‘అమెజాన్ ప్రైమ్’ దక్కించుకుందని సినీవర్గాలు పేర్కొన్నాయి. దాదాపు రూ.105 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలిపాయి. అయితే, దాదాపు 6 వారాల తర్వాతే ఈ చిత్రం ఓటీటీలోకి వస్తుందని అంచనా వేశాయి.

News January 10, 2025

జై షాకు బీసీసీఐ సన్మానం

image

ఐసీసీ నూతన ఛైర్మన్‌ జై షాను సన్మానించనున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఈ ఆదివారం ముంబైలో జరిగే ప్రత్యేక సమావేశం అనంతరం షాకు ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నాయి. షా ప్రస్తుతం బీసీసీఐలో ఏ హోదాలోనూ లేనప్పటికీ ఆయన్ను ప్రత్యేక అతిథిగా సమావేశానికి ఆహ్వానిస్తామని వెల్లడించాయి. బీసీసీఐ కొత్త కార్యదర్శి, కోశాధికారిని ఈ సమావేశంలో బోర్డు సభ్యులు ఎన్నుకోనున్నారు.