News February 22, 2025
‘బాయ్‌కాట్ ఓయో’ ట్రెండింగ్.. వివరణ ఇచ్చిన సంస్థ

<<15536319>>తమ ప్రకటనపై ‘బాయ్‌కాట్ ఓయో’ ట్రెండ్<<>> అవుతుండటంతో ఓయో స్పందించింది. ‘అయోధ్య, వారణాశి, ప్రయాగరాజ్ తదితర పవిత్ర ఆధ్యాత్మిక ప్రదేశాల్లోనూ మేం సేవలందిస్తున్నాం. ఆ విషయాన్ని చెప్పడమే ఆ యాడ్ వెనుక ఉద్దేశం తప్ప మనోభావాలను దెబ్బతీయడం కాదు. ఆధ్యాత్మిక పర్యాటకాన్ని వృద్ధి చేయాలనేది మా లక్ష్యం. పురాతన సంప్రదాయాలకు నెలవైన మన దేశంలోని విశ్వాసాల పట్ల మాకు అపారమైన గౌరవం ఉంది’ అని వివరణ ఇచ్చింది.
Similar News
News February 22, 2025
హోలీ పండుగపై కామెంట్స్.. బాలీవుడ్ డైరెక్టర్‌పై కేసు

హోలీ పండుగపై బాలీవుడ్ డైరెక్టర్, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ పండుగ తక్కువ స్థాయి వారు(ఛప్రి) చేసుకునేదని ఆమె వ్యాఖ్యానించారు. ఫరా వ్యాఖ్యలు హిందువులను కించపరిచేలా ఉన్నాయని ఓ వ్యక్తి ముంబై పోలీసులను ఆశ్రయించగా ఆమెపై కేసు నమోదు చేశారు. మరోవైపు ఫరాపై చర్యలు తీసుకోవాలని, ఆమె వెంటనే క్షమాపణ చెప్పాలని సోషల్ మీడియాలో పలువురు డిమాండ్ చేస్తున్నారు.
News February 22, 2025
GOLD: పెరుగుతూ పోతే కొనేదెలా!

బంగారం ధరల పెరుగుదల చూస్తుంటే త్వరలోనే తులం రూ.లక్షకు చేరేలా కనిపిస్తోంది. ఇవాళ 22 క్యారెట్ల బంగారం ధర పెరిగి, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.200 పెరిగి రూ.80,450లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.330 తగ్గడంతో రూ.87,770లకు చేరింది. అటు వెండి ధర మాత్రం రూ.900 తగ్గి కేజీ రూ.1,07,000 వద్ద కొనసాగుతోంది.
News February 22, 2025
గ్రూప్-2 వాయిదా వేయాలని ప్రభుత్వం ఆదేశం

ఏపీలో రేపు జరగాల్సిన గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని APPSCని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. రోస్టర్ విధానంలో లోపాలున్నాయంటూ కొద్ది రోజులుగా అభ్యర్థులు చేసిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంది. అటు రోస్టర్ అంశంపై కోర్టులో ఉన్న పిటిషన్ విచారణ మార్చి 11న జరగనుండగా, అప్పటి వరకు వేచి చూడాలని ప్రభుత్వం భావిస్తోంది.