News December 1, 2024
‘బాయ్‌కాట్ పుష్ప-2’ ట్రెండింగ్.. కారణమిదే!

దేశవ్యాప్తంగా పుష్ప-2కి క్రేజ్ మామూలుగా లేదు. హిందీ రాష్ట్రాల్లో ఓపెనింగ్స్ భారీగా వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో మాత్రం ‘బాయ్‌కాట్ పుష్ప-2’ ట్రెండ్ అవుతోంది. టిక్కెట్ రేట్లను భారీగా పెంచడమే దీనిక్కారణం. మల్టీఫ్లెక్స్‌లలో రూ.500 నుంచి రూ.1000 మధ్యలో, సింగిల్ స్క్రీన్లలో సుమారు రూ.400 వరకు రేట్లున్నాయి. సినిమాకు ఇంత ఖర్చుపెట్టలేం అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News November 26, 2025
స్టూడెంట్స్ అసెంబ్లీ.. దద్దరిల్లుతున్న సభ

AP: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అమరావతిలో జరుగుతున్న ‘స్టూడెంట్స్ అసెంబ్లీ’ వాడివేడిగా జరుగుతోంది. విద్యార్థులు మంచి అంశాలపై చర్చ జరుపుతున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై ప్రశ్నలు ఎక్కుపెడుతున్నారు. మంత్రులు వీటికి దీటుగా బదులిస్తున్నారు. లోకేశ్, పవన్ కళ్యాణ్ పాత్రలు పోషిస్తున్న చిన్నారులు పంచ్ డైలాగులతో సమాధానాలు ఇస్తున్నారు. సభ పక్కదారి పట్టకుండా స్పీకర్(అమ్మాయి) అదుపు చేస్తున్నారు.
News November 26, 2025
జూన్-జులై మధ్య గోదావరి పుష్కరాలు?

AP: గోదావరి పుష్కరాలను 2027 జూన్ 26-జులై 7 మధ్య నిర్వహించనున్నట్లు సమాచారం. వేదపండితులతో దేవదాయ శాఖ చర్చించి ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆమోదం తర్వాత అధికారిక ప్రకటన వెలువడనుందని అధికారవర్గాలు వెల్లడించాయి. గోదావరి పుష్కరాల నిర్వహణ, ఏర్పాట్లపై CM CBN త్వరలో మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహిస్తారని పేర్కొన్నాయి. చివరిసారి 2015లో గోదావరి పుష్కరాలు జరిగిన విషయం తెలిసిందే.
News November 26, 2025
NPCILలో 122 పోస్టులు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

ముంబైలోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(NPCIL)లో 122 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. డిగ్రీ, PG, PG డిప్లొమా, MBA, BE, B.Tech, LLB ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. డిప్యూటీ మేనేజర్ పోస్టుకు నెలకు రూ.56,100, Jr ట్రాన్స్‌లేటర్‌కు రూ.35,400 చెల్లిస్తారు. npcilcareers.co.in


