News July 10, 2024
సీఎంతో భేటీ కానున్న BPCL ప్రతినిధులు

AP: మచిలీపట్నంలో రిఫైనరీ ఏర్పాటుకు బీపీసీఎల్ సుముఖంగా ఉందని ఎంపీ బాలశౌరి తెలిపారు. రాష్ట్రానికి వచ్చిన BPCL ప్రతినిధులు విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. కాసేపట్లో సీఎం చంద్రబాబుతో సమావేశం కానున్నారు. రూ.60వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటయ్యే ఈ రిఫైనరీ కోసం 2-3వేల ఎకరాల భూమి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీని ద్వారా 25 వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది.
Similar News
News December 30, 2025
స్పెర్మ్ డొనేషన్.. ఈ రూల్స్ తెలుసా?

* 3-5 రోజులు శృంగారానికి దూరంగా ఉండాలి.
* 21-45 వయసుతో ఫిజికల్‌గా, మెంటల్‌గా హెల్తీగా ఉండాలి.
* స్మోకింగ్, డ్రింకింగ్, డ్రగ్స్ అలవాటు ఉండకూడదు.
* 1ml స్పెర్మ్‌లో 15-20 మిలియన్ల కణాలలో 40% యాక్టివ్ సెల్స్ ఉండాలి.
* HIV, హెపటైటిస్ B, C, సిఫిలిస్, సిస్టిక్ ఫైబ్రోసిస్ వ్యాధులు ఉండకూడదు.
* డొనేట్ చేసిన 6నెలల తర్వాత డోనర్‌కు మరోసారి టెస్టులు చేసి నెగటివ్ వస్తేనే స్పెర్మ్ ఉపయోగిస్తారు.
News December 30, 2025
టుడే టాప్ స్టోరీస్

*అసెంబ్లీలో కేసీఆర్‌ను పలకరించిన CM రేవంత్
*ఏపీలో 28 జిల్లాలు ఏర్పాటు చేస్తూ క్యాబినెట్ నిర్ణయం.. జనవరి 1నుంచి అమలులోకి
*రాయచోటి ప్రజలకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి క్షమాపణలు
*మచిలీపట్నం నుంచి హైదరాబాద్ ఫ్యూచర్ సిటీకి ఎక్స్‌ప్రెస్ వే
*ఉన్నావ్ రేప్ కేసు.. సెంగార్‌ను విడుదల చేయొద్దన్న సుప్రీంకోర్టు
*FIDE వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాలు గెలిచిన హంపి, అర్జున్ ఎరిగైసి
News December 30, 2025
గౌరవం ఇచ్చి పుచ్చుకునేది: KTR

TG: అసెంబ్లీలో సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్ <<18701442>>కరచాలనం<<>> చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో లేచి నిలబడకపోవడంతో KTRపై విమర్శలొచ్చాయి. వాటికి ఆయన తనదైనశైలిలో సమాధానం చెప్పారు. ‘నేను వ్యక్తులను బ్యాడ్‌గా ట్రీట్ చేయను. వాళ్లు ఎలా ఉంటారో అలాగే ట్రీట్ చేస్తాను’ అన్న కొటేషన్ షేర్ చేశారు. దానికి ‘గౌరవాన్ని గెలుచుకోవాలి.. ఆత్మగౌరవం విషయంలో రాజీ పడకూడదు’ అని క్యాప్షన్ పెట్టారు.


