News March 12, 2025

BPL:తల్లిదండ్రులు మందలించారని విద్యార్థి సూసైడ్: SI

image

ఇంటర్ విద్యార్థి పురుగుమందు తాగి మరణించినట్లు తాళ్లగురజాల SIరమేశ్ తెలిపారు. SIకథనం ప్రకారం.. బెల్లంపల్లి మండలం పెరకపల్లికి చెందిన మనోజ్ కుమార్(18)అనే సీనియర్ ఇంటర్ విద్యార్థి పరీక్షలకు సిద్ధం కాకుండా ఫోన్‌లో ఆటలాడుతున్నాడని తల్లిదండ్రులు మందలించారు. దీంతో పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కుటుంబీకులు ఆసుపత్రికి తరలించగా..చికిత్స పొందుతూ మరణించాడని తండ్రి తెలుపాడని SI వివరించారు.

Similar News

News November 26, 2025

APPLY NOW: BECILలో ఉద్యోగాలు

image

బ్రాడ్‌కాస్ట్ ఇంజినీర్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) 18 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు DEC 7వరకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. డ్రైవర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, మెడికల్ ఫిజిసిస్ట్ పోస్టులు ఉన్నాయి. ఉద్యోగాన్ని బట్టి టెన్త్, ఇంటర్, PG, PG డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. డ్రైవర్ పోస్టుకు హెవీ వెహికల్ లైసెన్స్ తప్పనిసరి.

News November 26, 2025

MDK: ఎన్నికల ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలి: SEC

image

రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్లతో వీసీ నిర్వహించి, డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మూడు విడతల్లో పోలింగ్ జరుగుతుందని తెలిపారు. టి-పోల్‌లో రిజర్వేషన్లు, పోలింగ్ కేంద్రాల వివరాలు అప్‌డేట్ చేయాలని, ఫిర్యాదులు మూడు రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించారు. నామినేషన్లు నవంబర్ 27–29 స్వీకరణపై మార్గదర్శకాలు ఇవ్వాలని చెప్పారు.

News November 26, 2025

BREAKING: వరంగల్: ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్ సస్పెండ్

image

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అవినీతి ఆరోపణలు రుజువు కావడంతో ఇన్‌స్పెక్టర్ ఓ.రమేష్, కానిస్టేబుల్ జి.రఘును సస్పెండ్ చేస్తూ సీపీ సన్ ప్రీత్ ఉత్తర్వులు జారీ చేశారు. మామూనూరు పీఎస్ నుంచి కంట్రోల్ రూమ్‌కు బదిలీ అయిన ఇన్‌స్పెక్టర్ రమేష్‌తో పాటు, కానిస్టేబుల్ రఘుపై వచ్చిన ఆరోపణలు అధికారుల విచారణలో నిర్ధారణ అయ్యాయి. దీంతో సీపీ ఈ చర్య తీసుకున్నారు.