News March 12, 2025

BPL:తల్లిదండ్రులు మందలించారని విద్యార్థి సూసైడ్: SI

image

ఇంటర్ విద్యార్థి పురుగుమందు తాగి మరణించినట్లు తాళ్లగురజాల SIరమేశ్ తెలిపారు. SIకథనం ప్రకారం.. బెల్లంపల్లి మండలం పెరకపల్లికి చెందిన మనోజ్ కుమార్(18)అనే సీనియర్ ఇంటర్ విద్యార్థి పరీక్షలకు సిద్ధం కాకుండా ఫోన్‌లో ఆటలాడుతున్నాడని తల్లిదండ్రులు మందలించారు. దీంతో పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కుటుంబీకులు ఆసుపత్రికి తరలించగా..చికిత్స పొందుతూ మరణించాడని తండ్రి తెలుపాడని SI వివరించారు.

Similar News

News April 19, 2026

జమ్మికుంట: జిల్లా పద్మశాలి మహిళా అధ్యక్షురాలిగా కందికట్ల పద్మ

image

తెలంగాణ రాష్ట్ర పద్మశాలి చేనేత ఐక్య వేదిక కరీంనగర్ జిల్లా పద్మశాలి సంఘం మహిళా విభాగ నూతన అధ్యక్షురాలిగా జమ్మికుంటకు చెందిన కందికట్ల పద్మను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు వీర మోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. పద్మ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన సంఘ పెద్దలు, సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. పద్మశాలీల సంక్షేమం, ఐక్యత కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.

సంక్షేమ వారాన్ని విజయవంతం చేయాలి: కలెక్టర్‌

image

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సంక్షేమ వారాన్ని నిర్వహిస్తామని కలెక్టర్ గరిమా అగ్రవాల్ తెలిపారు. జిల్లాలోని అన్ని రెసిడెన్షియల్ విద్యాలయాలు, హాస్టళ్లకు ప్రత్యేక అధికారులుగా మండల, జిల్లా అధికారులను ఇప్పటికే నియమించామని, వారు రోజు తమ పరిధిలోని విద్యాలయాల్లో మధ్యాహ్న భోజనం చేసి, పరిసరాలు పరిశీలించి నివేదిక అందిస్తున్నారని తెలిపారు.