News April 22, 2025

BPL: చోరీకి పాల్పడిన మహిళ, మైనర్ల అరెస్ట్: CI

image

ఇంట్లో ఎవరూ లేని సమయంలో చోరీకి పాల్పడిన నిందితులను అరెస్టు చేసినట్లు రూరల్ CI అబ్సలుద్దీన్ తెలిపారు. బెల్లంపల్లి పట్టణం కాల్ టెక్స్ ఏరియాలో పెండ్లి బరాత్ సమయంలో జ్యోతి అనే మహిళ ఇంట్లో ఎవరూ లేరు. ఆ సమయంలో ఇంట్లోకి చొరబడి బంగారం, డబ్బులు దొంగతనం చేసిన స్వప్న, మరో ఇద్దరు మైనర్లను CC టీవీ కెమెరాల ఆధారంగా గుర్తించామన్నారు. సోమవారం వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Similar News

News April 22, 2025

ALERT: భక్తులకు TTD కీలక సూచన

image

వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈక్రమంలో భక్తులకు TTD కీలక సూచన చేసింది. చాలా మంది తమకు కేటాయించిన టైమ్ స్లాట్‌కు బదులు ముందే వచ్చి క్యూలో నిల్చుంటున్నారని మండిపడింది. రద్దీ అధికంగా ఉండటంతో ఇలా చేయడం సరికాదని, కేటాయించిన టైమ్‌కు మాత్రమే రావాలని సూచించింది. భక్తులకు ఇబ్బందులు లేకుండా క్యూలోనే భోజనం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.

News April 22, 2025

నారాయణపేట జిల్లా వైద్యాధికారిగా డా.జయచంద్ర మోహన్

image

నారాయణపేట DMHOగా డాక్టర్ చంద్రమోహన్‌ను నియమిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన ఇదివరకు ప్రభుత్వ వైద్య కళాశాలలో RMOగా పనిచేసి, ఇక్కడికి బదిలీ అయ్యారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగుల నియామకంలో అవినీతి, అక్రమాలు జరిగినట్లు పలు పత్రికల్లో వార్తలు రావడంతో ఆరోగ్యశాఖ ఇక్కడ పనిచేస్తున్న DMHO సౌభాగ్యలక్ష్మిని HYD హెడ్ ఆఫీస్‌కి అటాచ్ చేశారు.

News April 22, 2025

KNR: సెమిస్టర్ పరీక్షల నిర్వహణకు నిరాకరణ

image

KNR SU పరిధిలోని డిగ్రీ SEM పరీక్షల నిర్వహణకు సహకరించబోమని ప్రైవేట్ కళాశాలల సంఘం SUPMA తేల్చి చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పరీక్ష ఫీజులు చెల్లించామని, రాష్ట్ర ప్రభుత్వం గత 3 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న RTF, MTF బకాయిల విడుదలపై స్పష్టత వచ్చేవరకు పరీక్షల నిర్వహణను నిరాకరిస్తున్నట్లు SUPMA రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, జిల్లా కార్యదర్శి శ్రీపాద నరేశ్ SU అధికారులకు వినతిపత్రం ఇచ్చారు.

error: Content is protected !!