News April 12, 2025

BPL: ‘మహిళపై వేధింపులు.. వ్యక్తికి 55 రోజుల శిక్ష’

image

రేగొండ మండలం రంగయ్యపల్లికి చెందిన ఓ మహిళను అదే గ్రామానికి చెందిన కే.రాజేందర్ ఫొటోలు తీసి, సోషల్ మీడియాలో పెడతానంటూ వేధింపులు గురిచేస్తున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా జడ్జి పీ.నారాయణ బాబు 55 రోజుల శిక్ష, రూ.2000 జరిమానా విధించినట్లు SI సందీప్ తెలిపారు.

Similar News

News December 3, 2025

శ్రీకాకుళం: అకడమిక్ ఇన్స్ట్రక్టర్స్ నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

image

పాఠశాలల్లో అకడమిక్ ఇన్స్ట్రక్టర్స్ పోస్టుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈవో ఎ.రవిబాబు ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 24 పోస్టులు ఉన్నట్లు తెలిపారు. ఐదు నెలల కాలానికి పనిచేయవలసి ఉంటుందన్నారు. స్కూల్ అసిస్టెంట్లకు రూ.12,500, ఎస్జీటీలకు రూ.10 వేలు గౌరవ వేతనం ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ నెల 5 లోపు ఎంఆర్సీల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News December 3, 2025

ఖమ్మం: ఆ గ్రామం 7వ సారి ఏకగ్రీవంగా ఎన్నిక

image

కామేపల్లి మండలం పాతలింగాల గ్రామ పంచాయతీ ఎన్నిక ఏకగ్రీవమైంది. సర్పంచ్ పదవితో పాటు మొత్తం 8 వార్డు స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. కిన్నెర సుజాత సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. రాష్ట్ర అగ్రికల్చర్ కమిషన్ సభ్యుడు రాంరెడ్డి గోపాల్ రెడ్డి సారథ్యంలో ఈ జీపీని ముచ్చటగా ఏడోసారి ఏకగ్రీవంగా గెలుచుకుని, రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచింది. ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్, వార్డు సభ్యులను ఆయన అభినందించారు.

News December 3, 2025

బంధం బలంగా ఉండాలంటే ఆర్థిక భద్రత ఉండాల్సిందే!

image

మానవ సంబంధాల బలోపేతానికి ఆర్థిక సంబంధాలు కీ రోల్ పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. జీవితంలో ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు, భావోద్వేగ మద్దతు, సామరస్యం చాలా ముఖ్యమని, కానీ వీటికి తోడు ఆర్థిక భద్రత ఉన్నప్పుడే అవి మరింత పటిష్టంగా ఉంటాయని సైకాలజీ టుడే, యూగోవ్ సంస్థలు నిర్వహించిన సర్వేలో తేలింది. ఆర్థిక భద్రత లేదా స్థిరత్వం లేకపోతే చాలా వరకు సంబంధాలు విచ్ఛిన్నం అయ్యే అవకాశం ఉంటుందని వెల్లడించింది.