News April 12, 2025

BPL: ‘మహిళపై వేధింపులు.. వ్యక్తికి 55 రోజుల శిక్ష’

image

రేగొండ మండలం రంగయ్యపల్లికి చెందిన ఓ మహిళను అదే గ్రామానికి చెందిన కే.రాజేందర్ ఫొటోలు తీసి, సోషల్ మీడియాలో పెడతానంటూ వేధింపులు గురిచేస్తున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా జడ్జి పీ.నారాయణ బాబు 55 రోజుల శిక్ష, రూ.2000 జరిమానా విధించినట్లు SI సందీప్ తెలిపారు.

Similar News

News April 20, 2025

ఏం తప్పు చేశామో తెలియట్లేదు: పరాగ్

image

గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిపోవడం బాధ కలిగించిందని RR కెప్టెన్ రియాన్ పరాగ్ చెప్పారు. ‘మేం ఏం తప్పు చేశామో తెలియట్లేదు. 18-19 ఓవర్ వరకు మాదే గెలుపు అనుకున్నాం. 19 ఓవర్లోనే మ్యాచ్ పూర్తి చేసి ఉండాలి. ఈ ఓటమికి నాదే బాధ్యత. అలాగే మా బౌలింగ్‌లో చివరి ఓవర్ సందీప్ శర్మ ఎక్కువ రన్స్ ఇచ్చారు. అతను మంచి బౌలరే కానీ అతని బ్యాడ్ లక్. సమద్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు’ అని పేర్కొన్నారు.

News April 20, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News April 20, 2025

KMR: స్విమ్మింగ్ ఫూల్‌లో మునిగి యువకుడి మృతి

image

బిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామంలో శనివారం విషాదం చోటు చేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం.. బంధువుల ఇంట్లో పెద్దమ్మ తల్లి ఉత్సవాల కోసం వెళ్లిన నగేష్ అనే యువకుడు సరదాగా స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొట్టడానికి వెళ్లాడు. స్విమ్మింగ్ ఫూల్‌లో మునిగి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. నగేష్ హైదరాబాద్ వాసిగా పోలీసులు గుర్తించారు.

error: Content is protected !!