News October 31, 2024
ఇంటింటా BPL.. అప్పట్లో ఓ సంచలనం

1963 కేరళలోని పాలక్కడ్ జిల్లాలో ఆర్మీకి ప్యానల్ మీటర్లు సరఫరా చేయడానికి TP గోపాలన్ నంబియార్ బ్రిటిష్ ఫిజికల్ ల్యాబొరేటరీస్ (BPL)ను స్థాపించారు. అనంతరం ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీని సంస్థ ప్రారంభించింది. దీంతో 1990 దశకంలో ప్రతి ఇంటా మనకు BPL టీవీలు కనిపించేవి. అలా ప్రతి ఇంట్లో వస్తువు స్థాయికి సంస్థ ఎదిగింది. నెలలో 10 లక్షల TVల విక్రయంతో BPL అప్పట్లో సంచలనం సృష్టించింది.
Similar News
News December 4, 2025
తెలుగు చదువుకుంటేనే ఉద్యోగం.. వెంకయ్య కీలక వ్యాఖ్యలు

AP: తాను చదువుకునే రోజుల్లో అవగాహన లేక హిందీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నానని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య చెప్పారు. మాతృభాషకు ప్రాధాన్యం ఇచ్చి, ఆ తర్వాత సోదర భాషలు నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. మచిలీపట్నం కృష్ణా వర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘AP, TGలు తెలుగును పరిపాలనా భాషగా చేసుకోవాలి. తెలుగు చదువుకుంటేనే ఉద్యోగం ఇస్తామని చెప్పాలి. అప్పుడే తెలుగు వెలుగుతుంది’ అని పేర్కొన్నారు.
News December 4, 2025
బాత్రూమ్లో ఎంతసేపు ఉంటున్నారు?

డీహైడ్రేషన్, సరైన ఆహారం తీసుకోకపోవడం, ఫైబర్ కొరత వల్ల మలబద్ధకం ఏర్పడుతుందని అందరూ అనుకుంటారు. టాయిలెట్ను ఆపుకోవడం, బాత్రూమ్లో ఎక్కువసేపు గడపడమూ మలబద్ధకానికి కారణమేనంటున్నారు గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు. ‘పెద్దపేగు, పురీషనాళం అనుసరించే లయను విస్మరిస్తే మలం గట్టిగా మారుతుంది. ఫోన్ చూస్తూ 10 ని.ల కంటే ఎక్కువసేపు బాత్రూమ్లో కూర్చోవడం వల్ల మల రక్త నాళాలపై ఒత్తిడి పెరుగుతుంది’ అని పేర్కొంటున్నారు.
News December 4, 2025
మలబద్ధకాన్ని నివారించాలంటే?

* టాయిలెట్ వచ్చినప్పుడు వెంటనే వెళ్లాలి. రోజూ ఒకే సమయాన్ని అనుసరించాలి.
* సాధ్యమైనంత వరకు ఇండియన్ టాయిలెట్లను ఉపయోగించండి. వాటిని వాడటంలో సమస్యలుంటే వెస్ట్రన్ టాయిలెట్ల ముందు పీఠను ఉపయోగించి మోకాళ్లను కాస్త పైకి ఉంచుకోవాలి. ఇది మల మార్గాన్ని సులభతరం చేస్తుంది.
* 5-10 ని.ల కంటే ఎక్కువ సేపు బాత్రూమ్లో ఉండొద్దు.
* ఫుడ్లో తగినంత ఫైబర్, సరిపడినన్ని నీళ్లు తీసుకోవాలి. తేలికపాటి వ్యాయామాలు చేయాలి.


