News April 22, 2025

BPL: చోరీకి పాల్పడిన మహిళ, మైనర్ల అరెస్ట్: CI

image

ఇంట్లో ఎవరూ లేని సమయంలో చోరీకి పాల్పడిన నిందితులను అరెస్టు చేసినట్లు రూరల్ CI అబ్సలుద్దీన్ తెలిపారు. బెల్లంపల్లి పట్టణం కాల్ టెక్స్ ఏరియాలో పెండ్లి బరాత్ సమయంలో జ్యోతి అనే మహిళ ఇంట్లో ఎవరూ లేరు. ఆ సమయంలో ఇంట్లోకి చొరబడి బంగారం, డబ్బులు దొంగతనం చేసిన స్వప్న, మరో ఇద్దరు మైనర్లను CC టీవీ కెమెరాల ఆధారంగా గుర్తించామన్నారు. సోమవారం వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Similar News

News April 22, 2025

తొలి పునరుత్పాదక ఇంధన రాజధానిగా అమరావతి

image

అమరావతిని ప్రపంచంలో తొలి పునరుత్పాదక ఇంధన రాజధానిగా అభివృద్ధి చేయాలన్న దిశగా చర్యలు వేగవంతం చేశారు. 2050 నాటికి 2,700 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ లక్ష్యంగా ప్రభుత్వం ముందడుగు వేసింది. ప్రభుత్వం నిర్మించే ఇళ్లలో 1/3 పైకప్పు సోలార్ ప్యానెల్లకు కేటాయించనున్నారు. ప్రభుత్వ భవనాలు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు సోలార్ తప్పనిసరి. ఇప్పటికే 415 కిలోవాట్ల సోలార్ ప్యానెల్లు 16 కేంద్రాల్లో ఏర్పాటు అయ్యాయి.

News April 22, 2025

నేడే ఇంటర్ ఫలితాలు.. MBNRలో 22,483 మంది

image

తెలంగాణ ఇంటర్ బోర్డు ఫలితాలను నేడు విడుదల చేయనున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 22,483 ఇంటర్ విద్యార్థులు ఉన్నారు. ఇందులో ఫస్టియర్‌లో 10,922 సెకండియర్‌లో 11,561 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. కాగా వీరి భవితవ్యం నేటితో తేలనుంది. ఇంటర్మీడియట్ ఫలితాలను Way2Newsలో అందరికంటే ముందే తెలుసుకోండి.- ALL THE BEST

News April 22, 2025

IPL: ‘టాప్’ లేపుతున్న గుజరాత్

image

ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు అంచనాలను తలకిందులు చేస్తూ అదరగొడుతోంది. కేకేఆర్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించి టేబుల్‌ టాపర్‌గా తన స్థానాన్ని పదిలం చేసుకుంది. ఆరెంజ్, పర్పుల్ క్యాప్‌లు సైతం ఆ జట్టు వద్దే ఉన్నాయి. ఓపెనర్ సాయి సుదర్శన్ 417 రన్స్, బౌలర్ ప్రసిద్ధ్ 16 వికెట్లతో టాప్ ప్లేస్‌లో ఉన్నారు. సాయి సుదర్శన్, గిల్, బట్లర్‌తో GT టాప్ ఆర్డర్ దుర్భేద్యంగా ఉంది.

error: Content is protected !!