News December 26, 2025

BPS సద్వినియోగం చేసుకోవాలి: కమిషనర్

image

అర్హులైన భవన యజమానులు భవన క్రమబద్ధీకరణ పథకం-2025 (BPS–2025)ను సద్వినియోగం చేసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. 1985 జనవరి 1 నుంచి 2025 ఆగస్టు 31 వరకు నిర్మించిన అనధికార భవనాలు, అనుమతులకు విరుద్ధంగా చేసిన విస్తరణలు క్రమబద్ధీకరణకు అర్హమన్నారు. దరఖాస్తులు 11 మార్చి 2026లోపు www.bps.ap.gov.in ద్వారా మాత్రమే లైసెన్‌డ్ టెక్నికల్ పర్సనల్ (LTP) సహాయంతో సమర్పించాలన్నారు.

Similar News

News December 27, 2025

కాంగ్రెస్ ఎంపీ పోస్ట్.. BJPకి బూస్ట్

image

కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అద్వానీ పాదాల దగ్గర మోదీ కూర్చొన్న ఓ పాత ఫొటోను షేర్ చేస్తూ.. కింద కూర్చొనే సామాన్య కార్యకర్త కూడా CM, PM అయ్యే అవకాశం BJP, RSSలో ఉంటుందన్నారు. దీంతో ఇది పరోక్షంగా రాహుల్ గాంధీకి చురక అంటూ పలువురు సొంతపార్టీ నేతలే అభిప్రాయపడ్డారు. వివాదం ముదరడంతో తాను వ్యవస్థను మెచ్చుకున్నానని BJPని కాదని దిగ్విజయ్ వివరణ ఇచ్చారు.

News December 27, 2025

21ఏళ్లకే మున్సిపల్ ఛైర్మన్.. రికార్డు సృష్టించిన కేరళ యువతి

image

కేరళలో ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో పాలా మున్సిపాలిటీలోని 15వ వార్డు నుంచి 21 ఏళ్ల దియా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, విజయం సాధించారు. ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో, తీవ్రమైన రాజకీయ చర్చల అనంతరం ఆమెను మున్సిపల్ ఛైర్మన్‌గా ఎన్నుకున్నారు. మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో బీఏ ఎకనామిక్స్ చదివిన దియా చైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఉన్నత చదువులు కొనసాగిస్తానని తెలిపారు.

News December 27, 2025

వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పూజ

image

వైకుంఠ ద్వారాలు తెరుచుకునే పవిత్ర పర్వదినాన శ్రీమహావిష్ణువు అనుగ్రహం పొందాలనుకుంటున్నారా? మీ ఆర్థిక, కుటుంబ సమస్యల నుంచి విముక్తి లభించి, సకల ఐశ్వర్యాలు కలగాలని కోరుకుంటున్నారా? అయితే మీకు వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పూజ ఉత్తమమైనది. మీ పేరు, గోత్రనామాలతో జరిపించే సంకల్ప పూజ ద్వారా పాప విముక్తి పొంది, మోక్ష మార్గంలో పయనించవచ్చు. ఇప్పుడే వేదమందిర్‌లో మీ పూజను <>బుక్ చేసుకోండి<<>>.