News August 20, 2025
BR నాయుడు స్థాయి దిగజారి మాట్లాడుతున్నారు: భూమన

AP: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్థాయి దిగజారి మాట్లాడుతున్నారని మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. <<17466830>>గోశాల<<>> విషయంలో తనపై అసత్య ఆరోపణలు చేశారని మండిపడ్డారు. టీటీడీ ఛైర్మన్‌గా గతంలో తాను ఏనాడు రాజకీయాలు మాట్లాడలేదని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చి 13 నెలలు అవుతోందని, తాము అవినీతి చేసి ఉంటే విచారణ జరిపించాలని భూమన డిమాండ్ చేశారు.
Similar News
News March 23, 2026
మీ పిల్లలకు తప్పక నేర్పించండి!

పిల్లలకు ముఖ్యంగా 12ఏళ్ల లోపు <<19447164>>చిన్నారులకు<<>> తల్లిదండ్రులు రోడ్డు భద్రతా నియమాలు నేర్పించాలి. వీలైనంత వరకు జీబ్రా లైన్స్ వద్ద రోడ్డు దాటాలని.. ఎడమ, కుడి 2 వైపులా చూడాలని చెప్పాలి. వాహనాల వేగాన్ని గమనిస్తూ ఇప్పుడు రోడ్డు దాటడం సేఫేనా, ఆగుదామా? అని ఆలోచించాలని వివరించాలి. ఉన్నట్టుండి రహదారిపై పరిగెత్తడం, దూకడం చేయకూడదని నేర్పాలి. రోడ్డు దాటే టైమ్‌లో ఫోన్ వాడటం/హెడ్‌ఫోన్లు పెట్టుకోవద్దని హెచ్చరించాలి.
News March 23, 2026
నేడు షాహీద్ దివస్.. అమరవీరులకు జోహార్లు!

దేశ స్వాతంత్ర్య సమరంలో భగత్ సింగ్‌ది ప్రత్యేక స్థానం. లాలాలజపతి రాయ్ మరణించడం భగత్ సింగ్ పోరాటానికి ఆజ్యం పోసింది. తన స్నేహితులు సుఖ్‌దేవ్, రాజ్‌గురులతో కలిసి లాల మరణానికి కారణమైన జేమ్స్ స్కాట్‌ను చంపే క్రమంలో పొరపాటున జాన్ సౌండర్స్ అనే మరో ఆఫీసర్‌ను హతమార్చుతారు. ఈ కేసుపైనే బ్రిటిషర్లు వీరిని అరెస్ట్ చేసి 1931 MAR 23న ఉరి తీశారు. వీరి పోరాటానికి నివాళిగా ఏటా ఈరోజును షాహీద్ దివస్‌గా జరుపుకుంటాం.
News March 23, 2026
ఇవాళ ‘వాహన్’ పోర్టల్‌లోకి TG ఎంట్రీ

TG: కేంద్ర పరిధిలోని ‘వాహన్’ పోర్టల్‌తో రాష్ట్ర వాహనాల డేటా ఇవాళ అనుసంధానం కానుంది. ఈ సేవలను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నారు. ఇకపై రిజిస్ట్రేషన్, వెహికల్ ఓనర్ అడ్రస్, పేరు మార్పు, RC డూప్లికేట్, పన్ను చెల్లింపు వంటి సేవలన్నీ ఆన్‌లైన్‌కు మారనున్నాయి. RTA ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. అలాగే ఒకే పేరుపై <<19443159>>రెండో వాహనం<<>> కొంటే అదనంగా కట్టాల్సిన 2% లైఫ్ ట్యాక్స్ నేటి నుంచి రద్దవనుంది.


